ఎఫ్3 సినిమా గురించి హీరో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో హీరో వెంకటేష్, వరుణ్ తేజ్ లు కలిసి నటించిన తాజా చిత్రం ఎఫ్‌ 3.

ఈ సినిమా ఈ నెల 27వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే.

దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఇకపోతే సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నారు.ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హీరో విక్టరీ వెంకటేష్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు వెంకటేష్.ప్రతి సినిమా నా తొలి సినిమా మాదిరిగానే భావిస్తాను.

Advertisement

అలా ఎఫ్‌ 3 సినిమా కూడా అలానే చేశాను అని తెలిపారు.కామెడీ చేయడం నాకు ఇష్ఠం.

హీరో పాత్ర ఇలా ఉండాలి.అలా ఉండాలి అని అనుకోను.

ప్రతి సినిమా ఎంజాయ్‌ చేస్తూ చేస్తాను అని తెలిపారు వెంకటేష్.అయితే తాను సెట్‌లో నిర్మాత లాగే ఆలోచిస్తారట.

ఏదైనా వృధా అయితే చాలా బాధ కలుగుతుంది.సినిమా షూటింగ్‌కు ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం నసగా ఉంటంది.కానీ మూవీ హిట్‌ అయితే మాత్రం అవన్నీ మర్చిపోతారు చెప్పు పిచ్చారు వెంకటేష్.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
వ‌ర్షాకాలంలో నైట్ ఈ విధంగా పాల‌ను తీసుకుంటే మ‌స్తు హెల్త్ బెనిఫిట్స్‌!

అనంతరం పాన్ ఇండియా సినిమాలు గురించి మాట్లాడుతూ పాన్‌ ఇండియా చిత్రాలు అనేది కేవలం బిజినెస్‌ మాత్రమే.నా సినిమాకు పాన్‌ ఇండియా స్థాయి మార్కెట్‌ ఉందనుకుంటే.అంతటా విడుదల చేస్తారు.

Advertisement

లేదంటే ఇక్కడే రిలీజ్‌ చేస్తారు.పాన్‌ ఇండియా స్థాయి కథలు వస్తే.

నేను చేయడానికి సిద్దమే అని చెప్పుకొచ్చారు వెంకటేష్..