వామ్మో.. వీరసింహారెడ్డి మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఆ రేంజ్ లో ఉన్నాయా?

సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన వీరసింహారెడ్డి సినిమాకు రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగిందనే సంగతి తెలిసిందే.

ఫస్ట్ డే ఈ సినిమాకు ఏకంగా 25 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.

భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడం ఈ సినిమాకు ప్లస్ అయింది.వీరసింహారెడ్డి సినిమాకు ఈరోజు కూడా బుకింగ్స్ భారీ రేంజ్ లోనే ఉండటం గమనార్హం.వీరసింహారెడ్డి సినిమాకు కొంత నెగిటివ్ టాక్ ఉన్నా ఆ టాక్ వల్ల సినిమాకు నష్టం కలగదని సినిమా సులువుగనే బ్రేక్ ఈవెన్ అవుతుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.75 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరగగా తొలిరోజే 30 శాతానికి పైగా కలెక్షన్లను సొంతం చేసుకోవడం ఈ సినిమాకు ప్లస్ అయిందని కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.బాలయ్య వీరసింహారెడ్డి గెటప్ లో ప్రేక్షకులకు పూనకాలు తెప్పించారనే చెప్పాలి.

ఇంటర్వెల్ సీన్ వరకు గోపీచంద్ మలినేని ఫ్యాన్ బాయ్ లానే ఈ సినిమాను డీల్ చేశారు.ఫస్ట్ హాఫ్ లో గూస్ బంప్స్ తెచ్చే సీన్లు ఎన్నో ఉండగా సెకండాఫ్ లో ఆలాంటి రెండు లేదా మూడు సీన్లు ఉంటే బాగుండేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం వీరసింహారెడ్డి మూవీ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

62 సంవత్సరాల వయస్సులో కూడా బాలయ్య యాక్షన్ సీన్లలో అద్భుతంగా చేశారు.శృతి హాసన్ ఓవర్ యాక్షన్ మాత్రం సినిమాకు మైనస్ అయిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.శృతి హాసన్ పాత్రను దర్శకుడు సరిగ్గా క్రియేట్ చేఎయలేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

Advertisement

వీరసింహారెడ్డి ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చుడాల్సి ఉంది.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు