ఓటిటీలోకి 'వీరసింహారెడ్డి'.. అఫిషియల్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?

బాలయ్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉండడంతో స్టార్ డైరెక్టర్లు సైతం ఈయనతో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు.

ఇటీవలే సంక్రాంతి బరిలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వీరసింహారెడ్డి.ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.దీంతో అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోయింది.

అందుకే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Veera Simha Reddy Ott Release Date, Balakrishna, Veera Simha Reddy, Gopichand Ma
Advertisement
Veera Simha Reddy OTT Release Date, Balakrishna, Veera Simha Reddy, Gopichand Ma

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా థియేట్రికల్ రన్ ను కంప్లీట్ చేసుకుంది.అందుకే ఇప్పుడు ఓటిటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతుంది.

ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ గురించి ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ నే అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది ప్రకటించారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై లేటెస్ట్ అప్డేట్ అందించారు.

Veera Simha Reddy Ott Release Date, Balakrishna, Veera Simha Reddy, Gopichand Ma

సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 23 నుండి స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టు తెలిపారు.అఫిషియల్ అప్డేట్ రావడంతో ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

న్యూస్ రౌండప్ టాప్ 20

అలాగే దునియా విజయ్ విలన్ రోల్ లో నటించగా వరలక్ష్మి శరత్ కుమార్ కీలక రోల్ లో నటించింది.

Advertisement

తాజా వార్తలు