కెమెరాకు చిక్కిన ఘోర యాక్సిడెంట్.. కొద్దిలో ప్రాణాలు దక్కించుకున్న బైకర్..

సాధారణంగా యుక్త వయసులో ఉన్నప్పుడు బైక్స్‌( Bikes )పై చాలా మక్కువ ఉంటుంది.వాటిని రైడ్ చేస్తూ రయ్‌ రయ్‌మంటూ రోడ్లపై దూసుకెళ్దామనిపిస్తుంది.

 Vc Sajjanar Shares Bike Accident Video,vc Sajjanar Bike Accident Video,road Acci-TeluguStop.com

వేగంగా వెళ్తే నిండు ప్రాణం పోతుందనే ఆలోచన గానీ భయం గానీ వారికి అసలు కలగదు.కొందరైతే హైవేలపై స్టంట్స్ చేస్తూ వారి ప్రాణాలనే కాకుండా ఇతరుల ప్రాణాలను రిస్కుల పడేస్తుంటారు.

ఇలాంటి రైడర్లను పట్టుకొని ట్రాఫిక్ పోలీసులు( Traffic Police ) భారీ ఛలాన్లు విధిస్తున్నా వారి ప్రవర్తనలో మార్పు మారడం లేదు.థ్రిల్ కోసం పబ్లిక్ రోడ్లపై మూర్ఖంగా రైడ్ చేస్తూ చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

తాజాగా ఒక వ్యక్తి కూడా స్టంట్ చేసి యాక్సిడెంట్ కి గురయ్యాడు.ప్రమాదవశాత్తు అతడు కొద్దిలో తప్పించుకోగలిగాడు.

లేదంటే అతడు తల పచ్చడి పచ్చడి అయ్యేది.

ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియోను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్( VC Sajjanar ) తాజాగా ట్విట్టర్ అకౌంట్‌లో పంచుకున్నారు.షేర్ చేసిన కొంత సమయంలోనే ఇది వైరల్ గా మారింది.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే ఓ యువకుడు మోటార్ సైకిల్‌పై వీలీ వంటి స్టంట్లు చేస్తూ రోడ్డుపై దూసుకెళ్లడం చూడవచ్చు.

అతడు స్టంట్స్ చేస్తున్న రోడ్డు లారీలు, కార్లతో చాలా బిజీగా ఉంది.అలాంటి రోడ్డుపై జాగ్రత్తగా ఉండాలన్న సోయి లేకుండా ఆ యువకుడు అంతే స్టంట్స్ చేస్తూ ఉన్నాడు.

సరిగ్గా ఇదే సమయంలో హ్యాండిల్ బెణికింది.అంతే ఒక్కసారిగా బైక్ కింద పడిపోయింది.అటువైపు నుంచి వేగంగా ఒక ఎస్‌యూవీ దూసుకొచ్చింది.అది అతడి బైక్ ను తొక్కేసింది.అదృష్టం కొద్దీ సదరు బైకర్ కారు టైర్ల కింద పడకుండా పక్కకు పడిపోయాడు.లేదంటే అతడి తల నుజ్జు నుజ్జు అయ్యుండేది.

దేవుడి దయవల్ల ఇతడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.బైక్( Bike Car Accident ) మాత్రం పూర్తిగా ధ్వంసం అయ్యింది.ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి.“ఏదో సరదా కోసం స్కిట్లు చేస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి.జాగ్రత్త!! రద్దీ ఎక్కువగా ఉన్న రహదారులపై ఇలాంటి వెర్రి చేష్టలు అత్యంత ప్రమాదకరం.అందరికీ ఈ మహానుభావుడిలా అదృష్టం ఉండకపోవచ్చు.” అని సజ్జనార్ వీడియోకు ఒక క్యాప్షన్ జోడించారు.ఈ వీడియో( Viral Video )ను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube