దబాంగ్ పాపపై కన్నేసిన మెగా హీరో

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాగా నిలిచింది.ఈ సినిమాలో వరుణ్ యాక్టింగ్‌కు మాస్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

 Varun Tej To Romance Saiee Manjrekar-TeluguStop.com

ఈ సినిమాతో వరుణ్ తనలోని సరికొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు చూపించాడు.కాగా ఇప్పుడు వరుణ్ ఓ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ మూవీలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.

దీనికి సింబంధించిన స్క్రిప్టు వర్కులు ఇప్పటికే మొదలయ్యాయి.

అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన ఓ బాలీవుడ్ హీరోయిన్‌ను తెలుగులో తెరంగేట్రం చేయించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

ఇప్పటికే దీనికి సంబంధించిన సంప్రదింపులు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది.బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్ చిత్రంలో తొలిసారి ఇండస్ట్రీకి పరిచయమైన సాయీ మంజ్రేకర్ తన అందాల ఆరబోతతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.

అయితే ఈ బ్యూటీపై మన తెలుగు జనాల కన్న పడింది.

వెంటనే వరుణ్ తేజ్ నటించబోయే సినిమాలో తనను హీరోయిన్‌గా నటించాల్సిందిగా కోరుతున్నారు చిత్ర యూనిట్.

దీనికి సంధించిన సంప్రదింపులు కూడా జరిగాయట.అయితే అమ్మడు ఇప్పట్లతో తన నిర్ణయాన్ని చెప్పలేనని తేల్చేసిందట.

జనవరిలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ కనిపిస్తుందా లేదా అనేది ఇప్పుడు మిలియిన్ మార్క్ క్వశ్చన్‌గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube