వీడియో వైరల్ : ముక్కు అంచుపై బొంగరం తిప్పుతున్న యంగ్ హీరో..!

కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది.ఈ కారణంగా సినిమా షూటింగులను కూడా నిలిపివేశారు.

దీంతో సెలెబ్రిటీలతో సహా సామాన్యులంతా మరోసారి ఇళ్లకు పరిమితమైపోయారు.ఈ సమయంలో కొంతమంది సెలెబ్రిటీలు కొత్త హ్యాబిట్స్ అలవర్చుకుంటే… మరికొంతమంది తమలోని టాలెంట్ ను బయటకు తీస్తున్నారు.

తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ వీడియోలో లాక్డౌన్ సమయంలో కొత్తగా సంపాదించిన నైపుణ్యాన్ని వరుణ్ ప్రదర్శించాడు.

తన ముక్కుపై కొన్ని సెకన్ల పాటు ఒక ఫిడ్జెట్ స్పిన్నర్‌ను చక్కగా బ్యాలెన్స్ చేయగలిగాడు వరుణ్.ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Varun Tej Shows Off His Lockdown Skill With Fidget Spinner , Viral Video, Viral,
Advertisement
Varun Tej Shows Off His Lockdown Skill With Fidget Spinner , Viral Video, Viral,

కొంతమంది లాక్ డౌన్ ఎఫెక్ట్ అని కామెంట్ చేస్తున్నారు.కాగా టాలీవుడ్ లో సొంత ట్యాలెంట్ తో దూసుకెళ్తున్న మెగా హీరోల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు.విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును, అభిమానులను పొందారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్నాడు.కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.

జూన్ లేదా జూలైలో “గని” చిత్రీకరణను తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నారు.ఇప్పటికే దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

ఇంకా ఎఫ్ 3 చిత్రంలోనూ నటిస్తున్నాడు.ప్రస్తుతం వరుణ్ బాక్సింగ్ బేస్ స్టోరీ మీద చేస్తుండటంతో సినిమాకు క్రేజ్ బాగా వచ్చింది.

స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్, టైట్నింగ్ కు ఉపయోగపడే రెమెడీ ఇది.. డోంట్ మిస్!

సినిమా పేరు కూడా పవన్ కళ్యాణ్ బాలు సినిమాలోని కేరెక్టర్ పేరు కావడంతో మెగా ఫ్యాన్స్ ఇంకా సంబరపడిపోతున్నారు.

Varun Tej Shows Off His Lockdown Skill With Fidget Spinner , Viral Video, Viral,
Advertisement

మరోవైపు పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో తీస్తున్న సినిమా కూడా బాక్సింగ్ బేస్ స్టోరీ కావడంతో కాంపిటీషనల్ క్రేజ్ కూడా పెరిగింది.ఇప్పుడా సినిమాకు హాలీవుడ్ నుంచి స్టంట్ మాస్టర్ ని ప్రత్యేకంగా తీసుకొస్తున్నారనే సమాచారం తెలియడంతో ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.

తాజా వార్తలు