"ప్రేమ కాదంట" టైటిల్‌తో రాబోతున్న అల్లూ శిరీష్‌..!

అల్లు శిరీష్ ఒక్క హిట్ కోసం చాలా ఏళ్ల నుంచి శ్రమిస్తూనే ఉన్నారు.కెరీర్ ప్రారంభం నుంచీ కూడా విజయం కోసం పరితపిస్తూనే ఉన్నారు.

 Allu Sirish, Anu, New Movie, Title. Pemakadata, Latest News, Movie Poster,latest-TeluguStop.com

ఇప్పటి వరకు ఆయన ఖాతాలో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు.కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి ఓ మోస్తరు సినిమాలున్నా కూడా సరైన విజయం మాత్రం దక్కలేదు.

అలా అల్లు శిరీష్ ఓ సరైన సినిమా పడాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అలాంటి అల్లు శిరీష్ ఎదురుచూపులు ఫలించేలానే ఉన్నాయి.

అల్లు శిరీష్ చివరగా ఏబీసీడీ అంటూ మళయాలీ రీమేక్‌తో చేతులు కాల్చుకున్నారు.

అయితే ఈ సారి మాత్రం మోస్ట్ రొమాంటిక్ బాయ్‌గా అలరించేందుకు రెడీ అయినట్టు కనిపిస్తోంది.అను ఇమాన్యుయేల్‌తో కలిసి అల్లు శిరీష్ ఓ రేంజ్ రొమాన్స్ చేసినట్టు పోస్టర్లను బట్టి చూస్తేనే తెలుస్తోంది.ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఇలా వర్కవుట్ అయింది కాబట్టే.ఆఫ్ స్క్రీన్‌లో ఈ ఇద్దరూ రెచ్చిపోతోన్నట్టు తెలుస్తోంది.

అను ఇమాన్యుయేల్ అల్లు శిరీష్‌ల మీద ఎన్ని రకాల రూమర్లు వచ్చాయో అందరికీ తెలిసిందే.వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉన్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అందరూ రకరకాలుగా మాట్లాడుకున్నారు.

కానీ అదంతా సినిమాలోని కెమిస్ట్రీ కుదిరేందుకే అని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.అల్లు శిరీష్ ఆరో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలయ్యాయి.

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తున్న చిత్ర ఫస్ట్ లుక్‌, టైటిల్‌ని హీరో అల్లు శిరీష్ పుట్టినరోజు మే 30న చిత్రయూనిట్ రివీల్ చేసింది.మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై శిరీష్ 6వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ప్రీ లుక్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.తాజాగా ఫస్ట్ లుక్ అంటూ రెండు పోస్టర్స్ చిత్రయూనిట్ విడుదల చేసింది.ఈ రెండూ రొమాంటిక్‌గా ఉండటమే కాకుండా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.

వినూత్న కథలకే ఇంపార్టెన్స్ ఇచ్చే అల్లు శిరీష్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో పాటు ఫస్ట్ లుక్ కూడా ఆకర్షిస్తుండటంతో సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube