గాంఢీవధారి అర్జునతో వరుణ్ తేజ్ కు ఆ బాధ తీరుతుందా.. ఆ లోటును భర్తీ చేస్తాడా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరో వరుణ్ తేజ్( Varun Tej ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) తనయుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్ హీరో గత తన కంటికి ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

ఇది ఇలా ఉంటే మొన్నటి వరకు నిశ్చితార్థం పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వరుణ్ ఇప్పుడు మళ్లీ సినిమాలకు సంబందించిన వార్తలతో సోషల్ మీడియాలో నిలిచాడు.

వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గాంఢీవధారి అర్జున ( Gaṇḍhivadhari arjuna ) సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.ఈ ఏడాది వరుణ్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇదే.ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోంది.

వరుణ్ తేజ్ కెరీర్ లో ఇదే భారీ బడ్జెట్ సినిమా అంటున్నారు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్( BVSN Prasad ).ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు మూవీ మేకర్స్.అయితే గతేడాది గని, ఎఫ్3 సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

Advertisement

అయితే గత ఏడాది విడుదల అయిన వాటిలో గని సినిమా డిజాస్టర్ అవ్వగా, ఎఫ్3( F3 ) సినిమా హిట్ అయింది.కానీ సోలో హీరోగా మాత్రం సక్సెస్ ను అందుకోలేకపోయానే అన్న నిరాశ మాత్రం మిగిలిపోయింది.దీంతో ఆ నిరాశను గాంఢీవధారి అర్జున సినిమాతో తీర్చుకోవాలని భావిస్తున్నారు వరుణ్ తేజ్.

కాగా ప్రస్తుతం చిత్ర యూనిట్ విదేశాల్లో శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ప‌నిలో నిమ‌గ్న‌మై ఉంది.ఈ మూవీలో యాక్ష‌న్ సీక్వెన్స్ హైలైట్‌గా నిలుస్తాయ‌ని చెబుతున్నారు మూవీ మేక‌ర్స్.

మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

Advertisement

తాజా వార్తలు