రాయబారంకు వేళైంది

‘కంచె’ వంటి వైవిధ్యభరిత చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్‌ తన తర్వాత సినిమా ‘రాయబారం’ అంటూ ఇటీవలే ప్రకటించిన విషయం తెల్సిందే.

ఆ సినిమాలో మరోసారి మెగా హీరో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించబోతున్నాడు.

‘కంచె’ విడుదలై కొన్ని రోజులు కూడా కాకుండానే మళ్లీ వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.ప్రస్తుతం ‘రాయబారి’ కోసం క్రిష్‌ స్క్రిప్ట్‌ రెడీ చేస్తుంటే వరుణ్‌ తేజ్‌ తనను తాను రెడీ చేసుకుంటున్నాడు.

ఈ సినిమాలో వరుణ్‌ గడ్డంతో కనిపించబోతున్నాడు.గత చిత్రాలతో పోల్చితే ఈ సినిమాలో వరుణ్‌ కొత్తగా, వైవిధ్యంగా కనిపిస్తాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఈ చిత్రాన్ని క్రిష్‌ సొంత నిర్మాణ సంస్థలో తన సన్నిహితులతో కలిసి నిర్మించబోతున్నాడు.ఇక ఈ సినిమాను ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో ప్రారంభించబోతున్నారు.

Advertisement

చిత్రంకు సంబంధించిన ఎక్కువ శాతం షూటింగ్‌ను యూరప్‌లో చిత్రీకరించబోతున్నారు.యూరప్‌లో ప్రస్తుతం మంచు అధికంగా ఉంటుంది.

‘రాయబారి’ కథానుసారం సినిమా ఎక్కువగా మంచులో ఉంటుంది.అందుకే యురప్‌లో చిత్రీకరణ చేయబోతున్నారు.

దాదాపు రెండు నెలల పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు అక్కడే ఉండి చిత్రీకరించబోతున్నారు.ప్రస్తుతం ఈ సినిమాకు హీరోయిన్‌ను ఎంపిక చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని కూడా కంచె విడుదల అయిన సమయంలోనే అంటే దసరా సీజన్‌లో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా చంద్ర మోహన్ ఎలా మారాడు ?
Advertisement