వరుణ్ తేజ్( Varun Tej ) లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) నిశ్చితార్థం గ్రాండ్ గా జరగగా పెళ్లిని సైతం గ్రాండ్ గా జరపనున్నారని తెలుస్తోంది.ఇటలీలో వరుణ్ లావణ్య వివాహం జరగనుందని సమాచారం అందుతోంది.
మరోవైపు వరుణ్ తేజ్ వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.గాండీవధారి అర్జున సినిమాతో( Gandheevadhari Arjuna Movie ) వరుణ్ బిజీగా ఉండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.
ఆగష్టు నెల 25వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో సోలో హీరోగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేని వరుణ్ తేజ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని వరుణ్ తేజ్ భావిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
చిరంజీవి గారి ఛాలెంజ్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచన ఉందని వరుణ్ తేజ్ చెప్పుకొచ్చారు.ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తితో ఒకరోజు ఉండాలంటే కళ్యాణ్ బాబాయ్ తో ఉంటానని వరుణ్ తెలిపారు.
నేను ఎవరితోనో పోటీ పడాలని నేను ఎప్పుడూ భావించనని వరుణ్ తేజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.రమ్యకృష్ణగారితో( RamyaKrishna ) డేట్ కు వెళ్లాలని ఉందని చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఎంతో అభిమానమని వరుణ్ తేజ్ పేర్కొన్నారు.కొరటాల శివ డైరెక్షన్ లో నటించాలని నేను ఆశపడుతున్నానని ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన శ్రీమంతుడు మూవీ నాకు బాగా నచ్చిందని ఆయన తెలిపారు.
వరుణ్ తేజ్ రమ్యకృష్ణ పేరు చెప్పి లావణ్య త్రిపాఠికి ఒకింత షాకిచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.వరుణ్ తేజ్ రెమ్యునరేషన్ 10 కోట్ల రూపాయల నుంచి 15 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం.వరుణ్ తేజ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.