మెగా డాటర్ నిహారిక( Niharika ) ఈ మధ్య కాలంలో సినిమాలతో కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.రీఎంట్రీలో హీరోయిన్ గా కచ్చితంగా సక్సెస్ అవుతానని నిహారిక నమ్మకంతో ఉన్నారు.
అయితే జనసేన( Janasena ) తరపున నిహారిక తిరుపతి( Tirupati ) నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.గతంలో తిరుపతి నుంచి పోటీ చేసి చిరంజీవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
నిహారిక తిరుపతి నుంచి పోటీ చేస్తే మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తారని అభిమానులు భావిస్తున్నారు.అయితే వరుణ్ తేజ్ ( Varun Tej ) మాత్రం నిహారిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని నెటిజన్లు చెబుతున్నారు.
ఎన్నికల్లో ప్రచారం గురించి వరుణ్ స్పందిస్తూ పెదనాన్న, బాబాయ్, నాన్న ఏది చెబితే అది చేయడానికి సిద్ధమని కామెంట్లు చేశారు.

ఎన్నికల ప్రచారానికి సంబంధించి మా అవసరం ఉందని భావిస్తే ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొంటామని చెప్పుకొచ్చారు.పెద్దల నిర్ణయాల ప్రకారం పాలిటిక్స్ విషయంలో నిర్ణయాలు తీసుకుంటామని వరుణ్ తేజ్ కామెంట్లు చేశారు.ప్రతి సినిమాకు నేను రాజమండ్రికి వస్తానని ఆయన కామెంట్లు చేశారు.
వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్( Operation Valentine Movie ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటారేమో చూడాలి.

ఆపరేషన్ వాలంటైన్ సినిమాకు రీరిలీజ్ సినిమాల నుంచి గట్టి పోటీ నెలకొంది.ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా వరుణ్ తేజ్ ఈ సినిమాతో కచ్చితంగా హిట్ అందుకోవాల్సి ఉంది.సోలో హీరోగా సీరియస్ సినిమాలకు వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
నిహారిక ఇతర భాషలపై కూడా ఫోకస్ పెడితే ఆమె కెరీర్ పరంగా మరింత ఎదిగే అవకాశాలు అయితే ఉంటాయి.నిహారికను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.







