ఒక్క క్షణం కూడా వదలట్లేదు.. మంచి భర్త దొరికాడు.. వరలక్ష్మి శరత్ కుమార్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వరలక్ష్మీ శరత్ కుమార్( Varalakshmi Sarath Kumar ) కు మంచి గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.

ఈ ఏడాది జులై నెలలో వరలక్ష్మి పెళ్లి జరిగింది.

పెళ్లి తర్వాత జీవితం గురించి వరలక్ష్మి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.వరలక్ష్మీ శరత్ కుమార్ నికోలయ్ సచ్ దేవ్ ( Nikolai Such Dev )ను పెళ్లి చేసుకున్నారు.

భర్త పుట్టినరోజు సందర్భంగా వీడియో షేర్ చేసిన వరలక్ష్మి షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.ఈ ఏడాది వేగంగా చాలా విషయాలు జరిగాయని వరలక్ష్మి అన్నారు.

వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ జ్ఞాపకాలు అన్నీ మధుర జ్ఞాపకాలే అని ఆమె చెప్పుకొచ్చారు.నా భర్తను నేను ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పడం చాలా కష్టమని ఆమె కామెంట్లు చేశారు.

Advertisement

నా భర్త తన కంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని ఆమె కామెంట్లు చేశారు.మగాడు ఎలా ఉండాలనే దానికి నా భర్త ఉదాహరణ అని వరలక్ష్మి వెల్లడించారు.

నా భర్త నన్ను భద్రంగా కాపాడుకుంటున్నాడని ఎంతలా అంటే ఒక్క క్షణం కూడా నన్ను విడిచి ఉండట్లేదని ఆమె పేర్కొన్నారు.ఇంకా చాలా చెప్పాలని ఉందని ఆమె అన్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే నికోలయ్ సచ్ దేవ్ లాంటి భర్త దొరకడం నేను చేసుకున్న అదృష్టం అని వరలక్ష్మి పేర్కొన్నారు.

ఇంతకు మించి నిన్నేం అడగనని అమె వెల్లడించారు.

హ్యాపీ బర్త్ డే టూ వరల్డ్ బెస్ట్ హస్బెండ్ అంటూ వరలక్ష్మి కామెంట్లు చేశారు.వరలక్ష్మీ శరత్ కుమార్ వెల్లడించిన విషయాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.వరలక్ష్మి లాంటి భార్య దొరకడం నికోలయ్ సచ్ దేవ్ లక్ అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అక్రమ వలసదారుల బహిష్కరణ .. పంజాబ్ పోలీసులపై బాధితుల ఆరోపణలు
అక్రమ వలసదారుల బహిష్కరణ .. పంజాబ్ పోలీసులపై బాధితుల ఆరోపణలు

వరలక్ష్మి రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు