Vanitha Vijay Kumar : నాన్న వల్లే నా జీవితం నాశనం అయ్యింది..వనిత విజయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో కొనసాగే కొంతమంది సెలబ్రిటీలు వారు నటించిన సినిమాల ద్వారా పాపులర్ రావడం కంటే కాంట్రవర్సీల ద్వారానే పాపులర్ అవుతూ ఉంటారు.

ఇలా కాంట్రవర్సీల ద్వారా వార్తలలో నిలిచినటువంటి వారిలో నటి వనిత విజయ్ కుమార్( Vanitha Vijay Kumar ) ఒకరు.

ప్రముఖ నటుడు విజయ్ కుమార్( Vijay Kumar ) మంజుల( Manjula ) దంపతుల కుమార్తె వనిత విజయ్ కుమార్.ఈమె తండ్రితో కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున గొడవలు పడటంతో తనని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అనే సంగతి మనకు తెలిసిందే.

Vanitha Vijay Kumar Sensational Comments About Her Father Vijay Kumar

ఇటీవల విజయ్ కుమార్ మనవరాలు దియా ( Diya ) వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి.ఈ వివాహ వేడుకలలో భాగంగా తన మొదటి భార్య పిల్లలు అలాగే మంజుల పిల్లలు అందరూ కలిసి ఘనంగా పెళ్లి వేడుకలను జరుపుకున్నారు.కానీ వనీత విజయ్ కుమార్ కి మాత్రం ఆహ్వానం అందలేదు.

ఈ క్రమంలోనే వనిత విజయ్ కుమార్ తనని పెళ్లికి పిలవకపోవడం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే క్రమంలో తన తండ్రి గురించి ఈమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఒక ఓల్డ్ వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Vanitha Vijay Kumar Sensational Comments About Her Father Vijay Kumar
Advertisement
Vanitha Vijay Kumar Sensational Comments About Her Father Vijay Kumar-Vanitha V

ఇందులో భాగంగా వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ మా నాన్నను మీ పిల్లల పేర్లు ఏంటి అని అడిగితే నా పేరు తప్ప మిగిలిన అందరి పేర్లు చెప్పారు కానీ వారందరిలో కల్లా నేనే నాన్న మాట వినే దానిని కానీ నా పేరు మాత్రం పలకడానికి నాన్న ఇష్టపడలేదని వనిత తెలిపారు.ఇక ఆయన నా పేరు పలకడానికి ఇష్టం చూపకపోయినా నేను మాత్రం ఆయన కూతురినే అనే విషయం ఈ ప్రపంచానికి తెలుసు అంటూ వనిత తెలిపారు.నేడు నా జీవితం ఇలా అయింది అంటే అందుకు కారణం నాన్న .నాన్న వల్లే నా జీవితం నాశనమైందని ఆయన మాటలు వినడం వల్లే నేను ఇలా తయారయ్యాను అంటూ వనిత విజయ్ కుమార్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు