Vanitha Vijaykumar : నా మూడో భర్త చనిపోతే నా అవకాశాలు పోయాయి : వనిత విజయ్ కుమార్

వనితా విజయ్ కుమార్.

( Vanitha Vijaykumar ) మూడు పెళ్లిళ్లతో, తండ్రితో గొడవలతో, ఆస్తి పంపకాల విషయంలో అల్లరి పాలై రోడ్డు మీద పడ్డ ఒక నటి.

ప్రస్తుతం వనిత ఒంటరిగానే తన ఇద్దరు కుమార్తెలతో జీవిస్తుంది.కానీ మొదటి భర్త తో కన్నటువంటి కొడుకుని తన తండ్రి కోర్టు సహాయంతో తీసేసుకున్నప్పటికీ ఆ తర్వాత పుట్టిన ఇద్దరు కూతుర్లే ప్రపంచంగా ప్రస్తుతం ఆమె బ్రతుకుతుంది.

ఒకానొక సమయంలో ఒంటిమీద బట్టలతో ఇంటి నుంచి బయటకు గెంటివేయబడ్డ వనిత ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్, హోస్టింగ్, యూట్యూబ్ అంటూ పలు రకాల వ్యాపకాలతో డబ్బు బాగానే సంపాదిస్తుంది.

ఇక తన మూడవ భర్త విషయంలో ఆమె కొన్ని పొరపాటు చేసినట్టుగా ఒప్పుకుంటునే అతడు చనిపోవడం వల్ల తన జీవితంలో కొన్ని సినిమా అవకాశాలు కూడా కోల్పోయానని ఇటీవల ఒక మీడియా ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వనిత బయటపెట్టింది.డైరెక్టర్ పీటర్ పాల్( Director Peter Paul ) అనే వ్యక్తిని కొన్నాళ్లపాటు డేటింగ్ చేసింది వనిత.అతడి సహాయంతోనే వనిత యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి తానేంటో ప్రపంచానికి చూపించింది.

Advertisement

ఆ తర్వాత అతనితో ప్రేమ పెళ్లి అంటూ మరొక అడుగు ముందు వేసింది తన కూతుర్ల సమక్షంలో ఓ చిన్నపాటి సెర్మని చేసి అదే పెళ్లి అంటూ కూడా చెప్పింది అయితే అప్పటికే అతనికి ఈ లీగల్ గా విడాకులు కాకపోవడంతో వీరి పెళ్లి చెల్లలేదు.

మందుకు బానిసైన పీటర్ పాల్ వనిత తన జీవితంలోకి వచ్చిన తర్వాత దాని నుంచి బయటపడతారు అని అనుకుంది.కానీ ఆమె ఊహించినట్టుగా కాకుండా ఆరోగ్యం పాడయేంతవరకు తాగుతూనే ఉండడంతో మెడికల్ గా కూడా చాలా డబ్బు ఖర్చు చేసి అతని బాగుపరచుకోవాలని ప్రయత్నించింది.అవేమీ కుదరకపోవడంతో ఇక అతన్ని తన జీవితం నుంచి పంపించేసింది.

ఆ తర్వాత కొన్ని రోజులకి అతను తీసుకొని ఆరోగ్య సమస్యలతో కన్నుమూశాడు దాంతో వనితా మూడవ భర్త చనిపోయాడు అని అందరూ డిసైడ్ అయ్యారు అయితే ఆయన చనిపోయిన రెండు రోజులకి కొన్ని షూటింగ్స్ ఉన్నప్పటికీ ఎవరు ఫోన్ చేయకపోవడంతో విషయం ఏంటో తెలుసుకున్న వనిత షాక్ గురైంది.భర్త చనిపోయి బాధలో ఉండి ఉంటుంది ఆమెకి ఇప్పుడే డేట్స్ పెట్టకండి అంటూ సదరు నిర్మాతలు అనుకున్నారట.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement