Vamsi Paidipally Plans Telugu Directors

వంశీ పైడిపల్లి తదుపరి సినిమా అఖిల్ తో ఉన్నట్టుగా కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి.'ఊపిరి' సినిమాతో నాగ్ నుంచి మంచి మార్కులు కొట్టేసిన కారణంగా ఆయనకి ఈ ఛాన్స్ తగిలింది.అఖిల్ తో ఆయన సెట్స్ పైకి వెళతాడని అనుకుంటుండగా, ఈ ప్రాజెక్టు నుంచి ఆయన బయటికి వచ్చాడనే వార్త ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది

తాను రెడీ చేసుకున్న కథను అఖిల్ తో చేయాలని వంశీ అనుకున్నాడట.

అయితే హిందీలో హిట్ అయిన 'యే జవాని హై దివాని' సినిమాకి రీమేక్ చేయడానికే నాగార్జున ఆసక్తిని చూపించాడట.

'ఊపిరి' తరువాత మరో రీమేక్ చేస్తే, రీమేక్ లను మాత్రమే చేయగలడు అనే ముద్రపడుతుందనే ఆలోచనతో, ఈ ప్రాజెక్టు నుంచి వంశీ తప్పుకున్నాడని చెప్పుకుంటున్నారు

గతంలో ఎన్టీఆర్ కీ .చరణ్ కి కూడా వంశీ హిట్స్ ఇచ్చాడు.

అందువలన ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయాలనే ఆలోచనలో వంశీ ఉన్నాడని అంటున్నారు.అఖిల్ ప్రాజెక్టు నుంచి వంశీ బయటికి రావడమే నిజమైతే, ఆ స్థానంలోకి వచ్చే దర్శకుడు ఎవరో చూడాలి.