పోలీసులకు వల్లభనేని వంశీ ఫిర్యాదు ! ఏ విషయంపై అంటే.. ? 

2019 ఎన్నికల్లో గన్నవరం నుంచి టిడిపి ఎమ్మెల్యేగా గెలిచి, ప్రస్తుతం వైసీపీ అనుబంధ సభ్యుడిగా కొనసాగుతున్న వల్లభనేని వంశీ( Vallabaneni Vamsi ) మరోసారి వార్తల్లోకి వచ్చారు .

గత కొంతకాలంగా టిడిపి పైన చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు చేస్తూ వార్తల్లో ఉంటున్న వంశీ మరో వ్యవహారంతో వార్తల్లోకి ఎక్కారు.

తనను తన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని , వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వంశీ ఫిర్యాదు చేశారు.తనను , తన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని కొంతకాలంగా కెనడాలో చదువుతున్న యనమదల సందీప్ అనే వ్యక్తి తమను మానసికంగా వేధిస్తున్నాడని,  ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని గన్నవరం పోలీస్ స్టేషన్ లో వంశీ ఫిర్యాదు చేశారు.

సందీప్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వంశీ పేర్కొన్నారు.2019 ఎన్నికల్లో వంశీ పై పోటీ చేసి ఓటమి చెందిన యర్లగడ్డ వెంకట్రావు ఇటీవలే టిడిపిలోకి వెళ్లారు.వైసీపీలో ఆయన ఉండగా వంశీ,  వెంకటరావు వర్గాల మధ్య సయోధ్య కుదర్చడానికి  వైసిపి అధిష్టానం( YCP ) రంగంలోకి దిగింది.

వెంకట్రావుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినా,  ఆయన ఇటీవల టిడిపిలో చేరారు.

Advertisement

వచ్చే ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీ చేసేందుకు వంశీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇక గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంశీని ఉంటారని ఇప్పటికే జగన్( YS Jagan Mohan Reddy ) సైతం ప్రకటించడంతోనే వెంకట్రావు వైసీపీకి దూరమయ్యారు.ఇప్పుడిప్పుడే ఆ నియోజకవర్గంలో పరిస్థితులు చక్కబడుతుండగా సోషల్ మీడియా ద్వారా వంశీని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ కొంతమంది టీడీపీ అనుకూల వ్యక్తులు కామెంట్స్ చేస్తుండడంపై తాజాగా పోలీసులకు వంశీ ఫిర్యాదు చేశారు.

ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నా, వంశీ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు