మొదటిదే లేదంటే రెండోది వెతుకుతున్న హీరో

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా వస్తున్న వైష్ణవ్ తేజ్ ఇప్పటికే తన తొలి చిత్రం ‘ఉప్పెన’ను రిలీజ్‌కు రెడీ చేశాడు.

కాగా ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో ఉప్పెన సినిమా ఎలాంటి సాలిడ్ హిట్ అందుకుంటుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.వేసవి కానుకగా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్‌తో వాయిదా పడింది.

Vaishnav Tej To Sign UV Creations, Vaishnav Tej, UV Creations, Uppena, Mega Fami

ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారనే వార్తలు వినిపించినా, అవి నిజం కాదని తేలిపోయింది.అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, తన నెక్ట్స్ మూవీని కూడా లైన్‌లో పెట్టే పనిలో పడ్డాడు ఈ హీరో.

తాజాగా ఆయన తన రెండో చిత్రాన్ని ప్రముఖ ప్రొడక్షన్ కంపెనీ యువి క్రియేషన్స్ బ్యానర్ వారితో చేసేందుకు రెడీ అయ్యాడట.ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కించే ఈ సినిమాను త్వరలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు ఈ హీరో.

Advertisement

మొత్తానికి వైష్ణవ్ తేజ్ నటించిన తొలి చిత్రం రిలీజ్ కాకముందే తన రెండో చిత్రాన్ని తరకెక్కించేందుకు రెడీ అవుతుననాడు.మరి సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.

ఇక ఉప్పెన చిత్రంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తుండగా కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోండగా తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు