ఎట్టకేలకు మెగా హీరోను ఒప్పించిన సురేందర్ రెడ్డి.. ఇంతకీ ఎవరంటే?

స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ( Director Surender Reddy )గురించి తెలియని వారు లేరు.

ఈయన తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించారు.

అయితే అంతే స్థాయిలో డిజాస్టర్స్ కూడా ఈయన ఖాతాలో ఉన్నాయి.అందులో ఈ మధ్య వచ్చిన ఏజెంట్ మూవీ కూడా ఒకటి.

అక్కినేని అఖిల్ ( Akkineni Akhil )హీరోగా సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ఇటీవలే రిలీజ్ అయ్యింది.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం చవిచూసింది.

ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ చేయగా దారుణమైన ఫలితం వచ్చింది.అనిల్ సుంకర( Anil Sunkara ) పెట్టిన బడ్జెట్ లో సగం కూడా రాబట్టలేక పోయింది.

Advertisement

ఇక ఈ సినిమా పెద్ద డిజాస్టర్ కావడంతో ఈయనతో పని చేయడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు.ఏ హీరో కూడా ఇంతటి డిజాస్టర్ తర్వాత మూవీ అంటే భయపడుతున్నారు.

అయితే తాజాగా ఈయనకు ఒక మెగా హీరో ఓకే చెప్పినట్టు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.ఈ స్టైలిష్ డైరెక్టర్ తో పని చేయడానికి మెగా హీరోల్లో ఒక హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.ఆ హీరో ఎవరో కాదు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.

ఈయనతో మూవీ చేయడానికి ఒప్పుకున్నట్టు టాక్.పంజా వైష్ణవ్ తేజ్ సురేందర్ రెడ్డి చెప్పిన స్టోరీ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కోసం సురేందర్ రెడ్డి నిర్మాత కోసం వెతుకుతున్నాడని.మీడియం బడ్జెట్ తోనే ఈ సినిమాను తెరకెక్కించనున్నట్టు టాక్.అనుకున్న విధంగా నిర్మాత కనుక దొరికితే ఈ ప్రాజెక్ట్ అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

వైరల్ వీడియో : శివసేన నేతపై.. కత్తులతో దాడి చేసిన నిహాంగులు..
ఆ విధంగా జరగకపోతే ప్రమాదంలో కళ్యాణ్ రామ్ కెరీర్.. ఆ రేంజ్ హిట్ అందుకుంటారా?

వైష్ణవ్ తేజ్ ( Vaishnav Tej )ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆదికేశవ.కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.

Advertisement

ఈ సినిమా జులైలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

తాజా వార్తలు