చిరంజీవిపై ప్రేమతో అలా చేసిన వైష్ణవ్ తేజ్.. ఆయన నా ప్రాణం అని చెబుతూ?

తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ( Megastar Chiranjeevi )గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అగ్ర హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకోవడంతోపాటు దాదాపుగా 150 కు పైగా సినిమాలలో నటించి మెప్పించారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి తర్వాత మెగా ఫ్యామిలీ( Mega Family ) నుంచి ఎంతోమంది హీరోలు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.అటువంటి వారిలో మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ కూడా ఒకరు.

చిరంజీవి చెల్లెలి కొడుకులు అయినా సాయి ధరంతేజ్ వైష్ణవ తేజ్ లు ఇద్దరు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఇద్దరు హీరోలు ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు.

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీ హీరోగా పరిచయమయ్యాడు వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ).మొదటి సినిమానే నేషనల్ అవార్డు అందుకొని వైష్ణవ్ కు మంచి పునాది వేసింది.అయితే ఆ పునాదిని నిలబెట్టుకోవడం కోసం మెగా మేనల్లుడు చాలా కష్టపడుతున్నాడు.

Advertisement

అయితే ఉప్పెన తరువాత వైష్ణవ్ చేసిన రెండు సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి.ఇకపోతే వైష్ణవ్ ప్రస్తుతం ఆదికేశవ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే షూటింగ్ ని పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 24న విడుదల కానుంది. ఎన్ శ్రీకాంత్ రెడ్డి( N Srikanth Reddy ) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించింది.

ఇక విడుదల తేదీకి మరొక మూడు రోజులు మాత్రమే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ని మరింత వేగవంతం చేసింది.హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఈ నేపథ్యంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వైష్ణవ తేజ్ మెగాస్టార్ చిరంజీవవితో తనకున్న బాండింగ్ గురించి తెలిపారు.

ఈ సందర్భంగా వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.మెగా కుటుంబంలో షో స్టీలర్ అంటే చరణ్ అన్ననే.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆయన వేసుకొనే డ్రెస్సింగ్ కానీ, నడిచే విధానం కానీ ఎంతో హుందాగా ఉంటాయి.ఇక గుండుతో ఉన్న ఫోటోను చూపించి ఇలాంటి లుక్ లో ఒక సినిమా చేస్తారా విలన్ గా అన్న ప్రశ్నకు.

Advertisement

తప్పకుండా విలన్ గా చేయడానికి తానూ రెడీ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక తన తల మీద చిరు అని అక్షరాలు రాసి ఉన్న ఫోటోను చూపించినప్పుడు ఆ పని తాను ఎందుకు చేసాడో తెలిపాడు వైష్ణవ్.పెద్ద మామయ్య బర్త్ డే.అందరూ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తున్నారు.అన్నయ్య కత్తి ఇచ్చాడు.

నేనేం ఇవ్వగలుగుతాను నా ప్రాణం తప్ప.అప్పుడు నేను ఆలోచించాను.

ఆ సమయంలోనే నేను ఒక ఫుట్ బాల్ మ్యాచ్ చూసాను.అందులో ఫుట్ బాల్ లా హెయిర్ కట్ చేయించడం చూసాను.

అలా చేయిద్దామని ఫిక్స్ అయ్యాను.చిరంజీవి, పెద్ద మామ ఇలా స్టైల్ చేయిద్దామనుకున్నా కానీ, చిరు అనేది నా తలకు సరిపోతుంది అని అది రాసుకున్నా అని చెప్పుకొచ్చాడు.

ఈ సందర్భంగా వైష్ణవ తేజ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా వార్తలు