మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), శ్రీ లీల(Sreeleela) హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఆది కేశవ(Aadikeshava).ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి వైష్ణవ్ తర్వాత కొండపొలం, రంగ రంగ వైభవంగా అనే సినిమాలలో నటించారు.
ఇక ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు.అయితే సార్ ఎలాగైనా హిట్ కొట్టాలన్న ఉద్దేశంతోనే ఆది కేశవ అనే సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇక ఈ సినిమా నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ద్వారా మెగా హీరో సక్సెస్ అందుకున్నారా? ఈ సినిమా కథ ఏంటి? అనే విషయానికి వస్తే…
కథ:
బాలు (వైష్ణవ్ తేజ్)( Balu ) అల్లరి చిల్లరిగా తిరిగే ఒక మంచి యువకుడు, ఈయన ఎలాంటి పని పాట లేకుండా ఊరిలో ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ కాలం గడిపేస్తూ ఉంటారు.ఇలా ఎంజాయ్ చేస్తున్నటువంటి ఈయనకు చిన్నపిల్లలపై ఎవరైనా అత్యాచారాలు చేసిన మహిళలతో తప్పుగా ప్రవర్తించిన అసలు తట్టుకోలేరు వారికి తన స్టైల్ లోనే సమాధానం చెబుతూ ఉంటారు.బాలు తల్లిదండ్రులుగా (రాధిక శరత్ కుమార్, జయప్రకాశ్) అతన్ని ఉద్యోగం చెయ్యమని బతిమాలుతూ వుంటారు, వాళ్ళ కోరిక కాదనలేక ఒక కాస్మొటిక్స్ కంపెనీకి అప్లై చేస్తాడు.
ఆ కంపెనీ సీఈవో చిత్ర (శ్రీ లీల)( Chitra ) బాలుని ఇంటర్వ్యూకి చేసి అతను బెస్ట్ అని సెలెక్ట్ చేస్తుంది.
ఇక వీళ్లిద్దరూ ప్రేమలో పడతారు అయితే చిత్రకు మాత్రం తన తండ్రి మరొక వ్యక్తితో పెళ్లి చేయాలని భావిస్తారు.ఇదిలా ఉండగా బ్రహ్మపురంలో చెంగారెడ్డి (జోజు జార్జి)( Joju George ) అనే అతను అక్రమంగా మైనింగ్ చేయిస్తూ పిల్లలచేత పనులు చేయిస్తూ ఉంటాడు.అతన్ని అడ్డుకునేవాళ్ళందరినీ చంపేస్తూ ఉంటారు మరి రాయలసీమకు హైదరాబాద్లో పని చేసే బాలుకి ఏంటి సంబంధం? బాలుగా ఉన్నటువంటి ఈయన రుద్ర కాళేశ్వర్ రెడ్డిగా ఎందుకు మారారు? ఇలా బాలు చివరికి చిత్రనీ పెళ్లి చేసుకుంటారా వీర ప్రేమ ఫలిస్తుందా అన్న విషయాలు సినిమా చూడాల్సిందే.
నటీనటుల నటన:
వైష్ణవ్ తేజ్ ఎప్పటిలాగే తనతో ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నారు.యాక్షన్స్ సన్ని వేషాలలో ఎంతో అద్భుతంగా నటించారు.
ఇక శ్రీ లీల నటన గురించి చెప్పాల్సిన పనిలేదు.ముఖ్యంగా డాన్సులు మాత్రం శ్రీలీల ఇరగదీసారని చెప్పాలి.
వైష్ణవ్ శ్రీ లీల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి.రాధిక,( Radhika ) జయప్రకాశ్( Jaya Prakash ) తల్లిదండ్రులుగా చేశారు.
సద, అపర్ణ దాస్ పాత్రలు అంతగా ఆకట్టుకోవు.సుమన్, తనికెళ్ళ భరణి వారి పాత్రలకు వారు న్యాయం చేశారని చెప్పాలి.
టెక్నికల్:
టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు కథ ద్వారానే ప్రేక్షకుల ముందుకు వచ్చారనే చెప్పాలి మొదటి హాఫ్ మొత్తం బాగా సరదాగా ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు సాగదీసారు.ఇక మ్యూజిక్ మాత్రం అద్భుతంగా ఉంది పాటలు బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది అని చెప్పాలి.ఛాయాగ్రహణం కూడా ఎంతో అద్భుతంగా ఉంది ఎడిటింగ్ వర్క్ సినిమాకు ప్లస్ అయింది.
విశ్లేషణ:
రొటీన్ కథ ద్వారానే దర్శకుడు ప్రేక్షకుల ముందుకు వచ్చారని చెప్పాలి ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా పోతుంది కానీ సెకండ్ ఆఫ్ మాత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో( Rayalaseema Backdrop ) జరుగుతుంది.అయితే ఈ సినిమాలో రోటీన్ కథ అని చెప్పాలి.ఒక సన్నివేశం తర్వాత మరొక సన్నివేశం ఏమొస్తుందనేది ప్రేక్షకులు ఈజీగా గెస్ చేయగలరు.అయితే రొటీన్ కథతో అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకున్నారని చెప్పాలి.
ప్లస్ పాయింట్స్:
డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి, మ్యూజిక్ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.డాన్స్ అద్భుతం.హీరో నటన కూడా హైలెట్ అయింది.
మైనస్ పాయింట్స్:
రొటీన్ కథ, ఎక్కడెక్కడ సన్నివేశాలను సాగదీశారు, సినిమాలో ఎలాంటి ట్విస్టులు లేవు.
బాటమ్ లైన్:
చివరిగా ఆదికేశవ సినిమా గురించి చెప్పాలి అంటే ఒక రొటీన్ కథతో కేవలం వ్యాపారాత్మక విలువలతో తీసిన సినిమా ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో ఈ సినిమా చూశాము అనే భావన అందరిలోనూ కలుగుతుంది.