వైష్ణవ్ తేజ్ సినిమా కొట్టాల్సిందే..!

ఉప్పెనతో తొలి సినిమానే సెన్సేషనల్ హిట్ అందుకున్న వైష్ణవ్ తేజ్ తన సెకండ్ మూవీ కొండపొలంతో ప్రేక్షకులను నిరాశపరచాడు.

ఆ సినిమా తర్వాత తమిళ అర్జున్ రెడ్డి డైరక్టర్ గిరీశయ్య డైరక్షన్ లో రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు.

వైష్ణవ్ తేజ్ సరసన రొమాంటిక్ బ్యూటీ కెతిక శర్మ హీరోయిన్ గా నటించింది.దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఉప్పెన హిట్ పడి రెండో సినిమా కొండపొలం ఫ్లాప్ అవడంతో మూడవ సినిమా తప్పనిసరిగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Vaishnav Tej Must Get Hit For RRV Movie , Gireesayya , Kethika Sharma , Vaish

వైష్ణవ్ తేజ్ ఈ సినిమా హిట్ కొడితేనే తన కెరియర్ ట్రాక్ లోకి వస్తుంది.ఒకవేళ ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేకపోతే మాత్రం కెరియర్ రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.

అయితే రంగ రంగ వైభవంగా సినిమా మాత్రం వైష్ణవ్ తేజ్ ఖాతాలో మరో హిట్ సినిమా అవుతుందని అంటున్నారు.వైష్ణవ్ తేజ్, కెతిక శర్మల జోడీ సినిమాకు హైలెట్ గా నిలిచేలా ఉంది.

Advertisement

గిరీశయ్య తొలి తెలుగు సినిమాగా రంగ రంగ వైభవంగా మీద అంచనాలు బాగానే ఉన్నాయి.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు