తెలంగాణలో త్వ‌ర‌లోనే రేష‌న్ డీల‌ర్ల ఖాళీలు భ‌ర్తీ చేస్తున్నట్లు వెల్లడించిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి.. !

తెలంగాణ రాష్ట్రంలో రేష‌న్ డీల‌ర్ల భర్తీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా త్వరలో ఈ ఖాళీలను పూర్తిచేస్తామని రాష్ట్ర పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వెల్లడించారు.ఈ నేపధ్యంలో ఈరోజు రేష‌న్ డీల‌ర్ల అసోసియేష‌న్‌, ఉన్న‌తాధికారుల‌తో ఉచిత బియ్యం పంపిణీపై స‌మీక్ష నిర్వహించిన క్రమంలో గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ క‌రోనా సమయంలో పేద‌ల‌కు స‌త్వ‌ర‌మే రేషన్ బియ్యం అందేలా ఏర్పాట్లు చేయాల‌ని, ఈ విషయంలో రేష‌న్ డీల‌ర్లు చొరవ చూపించాలని, అధికారుల‌కు ఆదేశాలిచ్చారు.

ఇకపోతే ఇప్పటి వరకు రేష‌న్ డీల‌ర్లకు ఇవ్వవలసిన పాత బ‌కాయిలు రూ.56.7 కోట్లు విడుద‌ల చేస్తున్నామ‌ని వెల్లడించారు.కాగా జూన్‌, జూలై నెలలకు కలిపి ప్రతి ఒక్కరికి 20 కిలోల రేషన్‌ బియ్యం ఉచితంగా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఇక పనిలో పనిగా రేషన్ డీలర్ల అక్రమాల పై కుడా ఓ కన్నేస్తే బాగుంటుందని ప్రజలు ముచ్చటించుకుంటున్నారట.

బన్నీని ఆ రిక్వెస్ట్ చేసిన డేవిడ్ వార్నర్... ఓకే చెప్పిన అల్లు అర్జున్?

తాజా వార్తలు