వీసా దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్... ఇంటర్వ్యూలకు మినహాయింపు, విద్యార్ధులకు బిగ్‌రిలీఫ్..!!

చదువు, ఉద్యోగం, వ్యాపారం ఇలా ప్రతి యేటా అమెరికాకు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ఒక్క మనదేశం నుంచే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల యువత గమ్యస్థానం అమెరికాయే.

అయితే అంతమందికి వీసాలు కేటాయించడమంటే అగ్రరాజ్యానికి కత్తిమీద సామే.అయినప్పటికీ ఇబ్బందులను భరిస్తూనే వీసాలను కేటాయిస్తూ వస్తోంది పెద్దన్న.

ఇదిలావుండగా.అమెరికా వీసా పొందడం అంత తేలికేం కాదు.

దీనికి అభ్యర్ధులు ఎన్నో వ్యయప్రయాసల్ని భరించాల్సి వుంటుంది.అందులో ఒకటి వీసా ఇంటర్వ్యూ.

Advertisement

ప్రపంచవ్యాప్తంగా వున్న యూఎస్ ఎంబసీలు, కాన్సులేట్ కార్యాలయాల్లో దరఖాస్తుదారులు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి హాజరై.అక్కడి అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వుంటుంది.

వారు సంతృప్తి చెందితేనే మనకు వీసా వస్తుంది లేదంటే లేదు.అయితే కోవిడ్ తదితర కారణాల వల్ల దౌత్యకార్యాలయాల్లో వీసా ఇంటర్వ్యూలను అమెరికా ప్రభుత్వం కొన్ని నెలలుగా మినహాయిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా దీనిని మరోసారి పొడిగించింది.వచ్చే ఏడాది డిసెంబర్ 31 వరకు వలసేతర వీసా కేటగిరీల్లో ఇంటర్వ్యూలకు ఇస్తున్న మినహాయింపును పొడిగిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

అయితే కొత్తగా వీసాలు పొందేవారు, రెన్యూవల్ చేయించుకునే వారిని ఇంటర్వ్యూలకు పిలవాలా లేదా అని నిర్ణయించే అధికారాన్ని కాన్సులర్ అధికారులకే వదిలేసింది.అమెరికా ప్రభుత్వ నిర్ణయం వల్ల వీసా నిరీక్షణ సమయం బాగా తగ్గనుంది.తాత్కాలిక వ్యవసాయ, వ్యవసాయేతర కార్మికులు, విద్యార్ధులు, అకడమిక్ ఎక్స్చేంజీ విజిటర్స్, ప్రత్యేక వృత్తి నిపుణులు తదితర నిర్దిష్ట వలసేతర వీసాదారులకు ఈ ఇంటర్వ్యూ మినహాయింపు వర్తిస్తుంది.

కాలేయ సమస్యతో బాధ పడుతున్న చిన్నారికి సాయం చేసిన సాయితేజ్... ఈ హీరో గ్రేట్!
ఎన్టీఆర్ యాక్షన్ షురూ చేసేది అప్పుడేనట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

కాగా.నిపుణులైన వృత్తి పనివారిని అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో పనిచేసుకోవడానికి అనుమతించే హెచ్ 1 బీ వీసాకు సంబంధించి ఇంటర్వ్యూలను మినహాయిస్తున్నట్లు గతేడాది డిసెంబర్‌‌లో అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే.2022 ఆర్ధిక సంవత్సరానికి గానూ.హెచ్‌-1 బీ తదితర వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తాత్కాలికంగా వ్యక్తిగత ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ సహా కరోనా ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు