విదేశాల నుంచి ఆదాయమే లక్ష్యం .. కొత్త డిపార్ట్‌మెంట్‌ను సృష్టించిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) రాబోయే తన ఐదేళ్ల పాలనా కాలం ఎలా ఉండబోతుందో తెలిపేలా ఓ ట్రైలర్‌ను దేశ ప్రజలకు మరీ ముఖ్యంగా ప్రపంచానికి చూపెడుతున్నారు.

ఇప్పటికే కేబినెట్‌ను( Cabinet ) ఓ దారికి తెచ్చిన ట్రంప్ .

చైనా, కెనడాలతో తాను ఎలా వ్యవహరించేది ముందే హింట్లు ఇచ్చారు.తాజాగా అగ్రరాజ్యానికి విదేశాల నుంచి మరింత ఆదాయం సమకూర్చే మార్గాలపై డొనాల్డ్ ట్రంప్ ఫోకస్ పెట్టారు.

ఇందుకోసం కొత్త డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో పెద్దాయన ఉన్నారు.విదేశాల నుంచి సుంకాలు, ఇతర ఆదాయాలను వసూలు చేయడానికి ‘ఎక్స్‌టర్నల్ రెవెన్యూ సర్వీస్ ’( External Revenue Service ) అనే కొత్త ప్రభుత్వ సంస్ధను సృష్టిస్తామని వచ్చే వారం తన ప్రమాణ స్వీకారానికి ముందు కొత్త దిగుమతి సుంకాలను సిద్ధం చేస్తానని ట్రంప్ తెలిపారు.

జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించే రోజున ఈ విభాగాన్ని ఏర్పాటు చేస్తానని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో తెలిపారు.ఇప్పటికే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్( Internal Revenue Service ) ద్వారా అమెరికన్లపై చాలా కాలంగా పన్నులు విధిస్తున్నారని ఆయన వెల్లడించారు.

Us President-elect Donald Trump To Create New Department To Collect Revenue From
Advertisement
US President-elect Donald Trump To Create New Department To Collect Revenue From

అమెరికన్ ఆర్ధిక వ్యవస్ధ ప్రపంచానికి వృద్ధి, శ్రేయస్సును అందించిందని.అలాగే మనపై మనమే పన్నులు విధించుకున్నామని ఈ పరిస్ధితి మారాల్సిన సమయం ఆసన్నమైందని ట్రంప్ తన పోస్ట్‌లో తెలిపారు.వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించే వారి నుంచి మేము ఛార్జ్ చేయడం ప్రారంభిస్తామని, వారు ఇకపై న్యాయపరమైన వాటాను చెల్లించడం ప్రారంభిస్తారని ట్రంప్ పేర్కొన్నారు.

అయితే ఈ కొత్త డిపార్ట్‌మెంట్ ఎలా పనిచేస్తుంది? దానికి సారథ్యం ఎవరు వహిస్తారు? విధులు ఎలా ఉంటాయి? అనే దానిపై ఫెడరల్ వర్గాలు ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Us President-elect Donald Trump To Create New Department To Collect Revenue From

కొత్త ఏజెన్సీ.యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్( US Customs and Border Protection ) ద్వారా సుంకాలు, రుసుములు, జరిమానాలను వసూలు చేస్తుందా? లేక ఇంటర్నల్ సెక్యూరిటీ సర్వీస్ ద్వారా విదేశీ కార్పోరేట్ , వ్యక్తిగత ఆదాయంపై పన్నులను వసూలు చేస్తుందా అంటూ అమెరికన్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!
Advertisement

తాజా వార్తలు