ఏఐ నియంత్రణపై ఇండో-యూఎస్ సహకారాన్ని కోరిన ఎరిక్ గార్సెట్టి..

భారతదేశంలోని యూఎస్ AI రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌పై లోతైన ఇండో-యుఎస్ సహకారాన్ని రాయబారి ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) కోరారు.ఎరిక్ గార్సెట్టి కృత్రిమ మేధస్సు (AI) గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 Us Envoy Pitches For Indo-us Conversations On Ai Regulatory Framework Details, A-TeluguStop.com

ఏఐని ఎలా నియంత్రించాలనే దాని గురించి భారతదేశం, యూఎస్ కలిసి మరింత చర్చించాలని ఆయన కోరారు.ఇది వారి బంధాన్ని మరింత దృఢంగా, మెరుగ్గా చేయగలదని అతను అభిప్రాయం వ్యక్తం చేశారు.

అబ్జర్వర్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌( Observer Research Foundation ) నిర్వహించిన కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.

ఏఐ చాలా శక్తివంతమైనదని, మనం జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదకరమని గార్సెట్టి చెప్పారు.

దీనిపై ఇరు దేశాలు ఇంతకుముందు చర్చించుకున్నాయని, అయితే ఇంకా దేనిపైనా అంగీకరించలేదని ఆయన అన్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ) కూడా ఈ విషయంపై చాలా శ్రద్ధ వహిస్తున్నారని వెల్లడించారు.

తమ ఉత్పత్తులు ఎంత సురక్షితమైనవి, నమ్మదగినవో ప్రభుత్వానికి తెలియజేయాలని బైడెన్ ఏఐ కంపెనీలను ఆదేశించినట్లు కూడా తెలిపారు.

Telugu Ai, Airegulatory, Cybersecurity, Eric Garcetti, India Nership, Indo Pacif

ఏఐ వల్ల ఏదైనా చెడు జరగడానికి ముందు మనం వేగంగా పని చేయాల్సిన అవసరం ఉందని గార్సెట్టి చెప్పుకొచ్చారు.ఇది మనం అనుకున్నదానికంటే త్వరగా జరగవచ్చని ఆయన అన్నారు.భారతదేశం, యూఎస్ రక్షణ, విదేశాంగ మంత్రుల మధ్య ఇటీవల జరిగిన సమావేశం గురించి కూడా గార్సెట్టి మాట్లాడారు.

తమ రక్షణ భాగస్వామ్యంలో( Defence Cooperation ) పురోగతి సాధించామని ఆయన అన్నారు.పరిశ్రమ, రక్షణ ప్రాజెక్టులలో కలిసి పనిచేయడానికి ప్రణాళికలు కలిగి ఉన్నట్లు తెలిపారు.

Telugu Ai, Airegulatory, Cybersecurity, Eric Garcetti, India Nership, Indo Pacif

భారతదేశం, యుఎస్ కూడా ఏఐ గురించి ఎక్కువగా మాట్లాడాలని గార్సెట్టి అన్నారు.సాంకేతికతలో కొత్త రంగాలపై కలిసి పని చేయాలని అన్నారు.కేవలం ఆయుధాలపైనే కాకుండా, మన మిలిటరీలు ఏ విధంగా కలిసి పనిచేస్తాయనే దానిపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు.భారత్, అమెరికాలు సైన్స్ అండ్ టెక్నాలజీని మంచి ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ప్రజలను బాధించే లేదా విభజించే సాంకేతికతను మానుకోవాలని హెచ్చరించారు.

ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని శాంతియుతంగా ఉంచాలని భారత్, అమెరికా కోరుకుంటున్నాయని సమావేశం అనంతరం సంయుక్త ప్రకటనలో తేలిందని ఆయన అన్నారు.

నిబంధనలను పాటించాలని, ఇతర దేశాలకు సహకరించాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube