20 లక్షల మంది హిందువుల ఓట్లే కీలకం : ఇండో అమెరికన్ నేత రాజా కృష్ణమూర్తి

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు.

కీలక రాష్ట్రాల్లో విస్తరించి వున్న భారతీయ అమెరికన్లు ఇక్కడ నిర్ణయాత్మక శక్తిగా ఉన్న సంగతి తెలిసిందే.

వీరి ప్రాముఖ్యతను గుర్తించిన ఇరు పార్టీలు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రచారంలో హిందువులను ఆకర్షించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.ట్రంప్‌ ‘‘హిందూ వాయిసెస్‌ ఫర్‌ ట్రంప్‌’’ పేరిట, ఇటు బిడెన్‌ ‘‘హిందూ అమెరికన్స్‌ ఫర్‌ బిడెన్‌’’ పేరిట హిందూ ఓట్‌ బ్యాంకును ఆకట్టుకునే యత్నాలు ముమ్మరం చేశారు.2016లో హిందూ ఓట్‌బ్యాంక్ సత్తాను గుర్తించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబసభ్యులతో కలిసి దేవాలయాలను సందర్శించారు.ఈసారి కూడా వీరి మద్ధతు కూడగట్టేందుకు ఆయన తీవ్రంగా యత్నిస్తున్నారు.

అయితే డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ సైతం హిందువులను తన వైపుకు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు./br>

దీనిపై ఇండో అమెరికన్ రాజకీయ వేత్త రాజా కృష్ణమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న 20 లక్షల మంది హిందువుల ఓట్లు ఎన్నికల్లో కీలకమని ఆయన అన్నారు.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన రాజా కృష్ణమూర్తి.

Advertisement

ఆన్‌లైన్‌లో హిందూ అమెరికన్స్ ఫర్ బిడెన్ పేరిట ప్రచారం ప్రారంభించారు.బిడెన్- హారిస్ జోడికి ఓటేయాలని ఆయన ఇండో అమెరికన్లను కోరారు.

ముఖ్యంగా ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్ వంటి స్వింగ్ స్టేట్స్‌లో హిందువుల ఓటు బ్యాంక్ చాలా ముఖ్యమైనదన్నారు.బిడెన్ మాట నిలబెట్టుకునే మనిషని, సమానత్వాన్ని విశ్వసిస్తారని కృష్ణమూర్తి కొనియాడారు.

ఇదే ప్రచారంలో పాల్గొన్న న్యూజెర్సీ స్టేట్ కో నికి షా మాట్లాడుతూ.గత కొన్నేళ్లుగా విద్వేష ప్రసంగాలు, వివక్ష పెరిగిపోయాయని వ్యాఖ్యానించారు.

వలసదారులకు షాక్ : గ్రీన్ కార్డ్‌ దరఖాస్తులను నిలిపివేసిన అమెజాన్, గూగుల్
Advertisement

తాజా వార్తలు