ఉప్పెన హీరోకి లక్ కలిసి వచ్చేనా? ఆదికేశవ పరిస్థితి ఏంటో?

మెగా ఫ్యామిలీ నుండి ఉప్పెన సినిమా( Uppena movie ) తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్( Vaishnav tej ) అందరి దృష్టిని ఆకర్షించాడు.

మొదటి సినిమా తో వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిన వైష్ణవ్‌ తేజ్ ప్రస్తుతం సక్సెస్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

కొండ పొలం.రంగ రంగ వైభవంగా సినిమాలు ఆయనకి తీవ్ర నిరాశను మిగిల్చాయి.

అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు.

ఈ సినిమా లో హీరోయిన్ గా శ్రీ లీల ( Sreeleela )నటిస్తూ ఉండగా శ్రీకాంత్‌ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి.వచ్చే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

Advertisement

మేనమామ చిరంజీవి భోళా శంకర్‌ సినిమా ( Bhola Shankar Movie )విడుదలకు ఒక్క వారం గ్యాప్ తో వైష్ణవ్ తేజ్ సినిమా ఆదికేశవ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో వైష్ణవ్‌ తేజ్ కనిపించబోతున్న విధానం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇప్పటి వరకు సాఫ్ట్‌ బాయ్ పాత్ర ల్లో కనిపించిన ఈ మెగా హీరో ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ను ధరించి అత్యంత రౌద్రంగా ఉన్న ఫోటోల వైష్ణవ్ తేజ్ మెప్పించాడు.దాంతో ఈ సినిమా పరిస్థితి పాజిటివ్ గా ఉంటుందని.

మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.ప్రస్తుతం ఈ విషయం లో మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా వెయిట్‌ చేస్తున్నారు.

ఉప్పెన సినిమాను చూసి వైష్ణవ్ తేజ్ కు అభిమానులు అయిన వారు చాలా మంది ఉన్నారు.అందుకే ఆదికేశవ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?
Advertisement

తాజా వార్తలు