జూనియర్ ఆర్టిస్ట్ పై అత్యాచారం.. హీరో అరెస్ట్.. ఎవరంటే?

సమాజంలో రానురాను ఆడవారి పరిస్థితి మరింత దారుణంగా తయారవుతోంది.మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంటున్నాయి.

దేశవ్యాప్తంగా నిత్యం పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి.అయితే కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా సెలబ్రిటీలకు కూడా ఈ విషయంలో రక్షణ లేకుండా పోతోంది.తాజాగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ పై కూడా ఒక యువ హీరో అత్యాచారం చేశారు.

అతను మరెవరో కాదు యువ హీరో ప్రియాంత్ రావు.యువ హీరో ప్రియాంత్ రావుని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

ఒక లేడీ జూనియర్ ఆర్టిస్ట్ ప్రియాంత్ పై పోలీసులకు పిర్యాదు చేసిందట.ప్రియాంత్ మోసం చేసి అత్యాచారానికి కూడా పాల్పాడ్డాడని, కులం పేరుతో దూషించాడంటూ ఆమె తెలిపింది.

ఇక ప్రియాంత్ ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కి తరలించారు.కొత్తగా మా ప్రయాణం సినిమాలో ప్రియాంత్ హీరోగా నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాతో ప్రియాంత్ కు ఆమెకు పరిచయం ఏర్పడిందట్.

అలా రెండు నెలల స్నేహం తరువాత ప్రియాంత్ ఆమెను ప్రేమిస్తున్నట్లుగా చెప్పడంతో ఆమె కూడా అందుకు ఒకే అని చెప్పిందట.వారి మధ్య చనువు పెరగడంతో అతడు ఆమె పై పలుమార్లు అత్యాచారం కూడా చేశాడని పెళ్లి చేసుకుంటారని నమ్మించి అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది.అంతే కాకుండా శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ఆఫీస్ కి పలుమార్లు తీసుకెళ్లి తనను లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆమె ఆరోపిస్తోంది.

ప్రస్తుతం ఆమె గర్భం దాల్చడంతో ఆమెను అవాయిడ్ చేస్తున్నాడట.దాంతో ఆమె గర్భం పోవడానికి మెడిసిన్ ఉపయోగించడంతో ఆమె అనారోగ్య బారిన పడిందట.ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని ఆమె పిర్యాదులో పేర్కొంది.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
" autoplay>

తాజా వార్తలు