పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కొద్దిరోజులుగా వార్తలు గుప్పుమంటున్నాయి.ఆమె తనకు వరుసకు బాబాయ్ అయ్యే.

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి పై పోటీ చేయబోతున్నట్టుగా వార్తలు వినిపించాయి.విశ్వేశ్వర్‌ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు.

చేవెళ్ల నుంచి లోక్‌స‌భ‌కు పోటీ చేసి ఎన్నిక‌య్యారు.తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరారు.

వచ్చే ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించాలంటే ధీటైన అభ్యర్థిని నిలబెట్టాలని, అందుకు ఉపాసన సరైన ఛాయిస్ అని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నట్లు ఆంగ్ల మీడియాలో కధనాలు వెలువడ్డాయి.

Advertisement
Upasana Responds On Contest Against Konda Vishweshwar Reddy1-పొలిటి
Upasana Responds On Contest Against Konda Vishweshwar Reddy1

అయితే అందులో ఎంతమాత్రం నిజంలేదని.ఉపాసన సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.‘క్షమించండి ఇందులో నిజం లేదు.

ప్రస్తుతం నేను నా జాబ్‌ను ప్రేమిస్తున్నా.సంగీతా రెడ్డి నా బాస్‌ (విశ్వేశ్వర్‌ రెడ్డి భార్య).

చిన్నాన్న చేవెళ్లకు చేస్తున్న సేవ సాటిలేనిది’ అని ఆమె పోస్ట్‌ చేశారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
Advertisement

తాజా వార్తలు