ఇదేం చోద్యం: గడ్డం చేసుకోలేదని ఎస్ ఐ పై వేటు!

ఎవరైనా పోలీసులు తమ విధులను సరిగా నిర్వర్తించకుంటే వేటు పడుతూ ఉంటుంది.

కానీ ఇక్కడ మాత్రం గడ్డం చేసుకోలేదు అన్న కారణంగా ఆ పోలీసు అధికారిపై వేటు పడింది.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.

ఇంటెసర్‌ అలీ బాగ్‌పత్‌ అనే వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో ఒక స్టేషన్ ఎస్‌ఐగా పని చేస్తున్నాడు.అయితే అతడు గత కొద్దీ రోజులుగా గడ్డం పెంచుకుంటూ తిరుగుతున్నాడు.

అయితే అప్పటికే ఉన్నతాధికారులు అతడు గడ్డం చేయించుకోవాల్సిందిగా మూడు సార్లు ఆదేశించారు.అయితే అధికారులు సూచించినప్పటికీ అతగాడు ఏమాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా అలానే గడ్డం తో విధులకు హాజరవుతున్నారు.

Advertisement

ఈ క్రమంలో ఇంటెసర్‌పై ఉన్నతాధికారులు సస్పెన్షన్‌ వేటు వేశారు.అయితే విధులను సరిగా నిర్వర్తించకుండా ఉంటే ఇలా వేటు వేస్తె అర్ధం ఉంటుంది కానీ కేవలం గడ్డం తీయలేదని ఇలా సస్పెన్షన్ వేటు వేయడం మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

అయితే ఈ అంశంపై బాగ్‌పత్‌ ఎస్పీ అభిషేక్‌ సింగ్‌ మాట్లాడుతూ.‘పోలీసు మాన్యువల్‌ ప్రకారం కేవలం సిక్కులకు మాత్రమే గడ్డం ఉంచుకోవడానికి అనుమతి ఉంది.

అయితే మిగతావారందరూ మాత్రం నీట్‌గా గడ్డం చేయించుకోవాల్సిందే అని, ఒకవేళ గడ్డం ఉంచుకోవాలని ఆ అధికారి భావిస్తే మాత్రం అతడు దాని కోసం ముందుగానే అధికారుల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది అని ఆయన వివరించారు .ఈ క్రమంలో ఇంటెసర్‌ అలీని పదే పదే ఆ విషయంలో అనుమతి తీసుకోవాల్సిందిగా సూచించినప్పటికీ ఆయన ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం తో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఆయనను సస్పెండ్ చేసినట్లు తెలిపారు.అయితే మరోపక్క సస్పెండ్ కు గురైన ఇంటెసర్ మాత్రం తాను గడ్డం ఉంచడానికి అధికారుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నాను అని,కానీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు అంటూ తెలిపారు.

మరి ఉన్నతాదికారులు మాత్రం ఎస్ ఐ దే తప్పు అని చెబుతున్నారు.మరి ఎస్ ఐ వాదనకు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

పర్వత సింహంతో పోరాడిన కుక్క.. వీడియో చూస్తే వణుకే..
Advertisement

తాజా వార్తలు