పేరుకేమో ఆంధ్ర దేవానంద్ కానీ ఎందుకు కనబడకుండా పోయాడు ?

బాలీవుడ్ లో దేవానంద్ అంటే చాలా క్రేజ్ ఉంటుంది.బాలీవుడ్ తో పాటు యావత్ దేశం కూడా దేవానంద్ పట్ల చాలా ఆకర్షితులయ్యేవారు.

అయితే తెలుగులో వచ్చిన ఒక హీరో ఆంధ్ర దేవానంద్ గా పేరు గడించాడు.మరెవరో కాదు రామ్మోహన్ రావ్.

తేనె మనసులు కన్నమనసులు సినిమాతో మొదలుపెట్టిన ఈ నటుడు ఆంధ్ర దేవానంద్ గా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం.తొలి సినిమాలు బాగా విజయవంతం సాధించడంతో పెద్ద హీరో అవుతాడు అనుకున్నా రామ్మోహన్ రావు కేవలం 13 సినిమాలతోనే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు.

మరి అతడు ఏమయ్యాడు చివరికి ఎలా రామ్మోహన్ రావు కథ ముగిసింది అనే విషయం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.ఫిబ్రవరి 4, 1939లో ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు లో పుట్టాడు రామ్మోహన్ రావు.

Advertisement

అతడి తండ్రి వారణాసి రామారావు కి పుట్టిన 8 మందిలో రామ్మోహన్ రావు ఒకడు.అయితే రామ్మోహన్రావు చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు.

కర్నూల్ లో డిగ్రీ పూర్తి చేశాడు.ఆ తర్వాత హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనే కంపెనీలో బెంగళూరులో ఇంజనీరింగ్ మేనేజర్ గా ఉద్యోగం కూడా చేశాడు.

అతడు ఈ ఉద్యోగంలో కొనసాగి ఉంటే ఈరోజు ఒక పెద్ద వ్యాపారవేత్తగా లేదంటే బాగా సెటిల్ అయినా ఒక ఉద్యోగస్తుడిగా ఆయన ఉండేవాడు.అన్ని వదులుకొని ఈ సినిమా ఇండస్ట్రీకి రావడంతో అతడికి సర్వం పోయింది అని చెప్పాలి.సినిమా అంటే ఇష్టం కలగడంతో అటుగా ప్రయత్నాలు కొనసాగించాడు మొదటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తేనె మనసులు అనే సినిమాలో నటించాడు ఆ తర్వాత రంగులరాట్నం కన్నె మనసులు అంటే హిట్టు సినిమాల్లో నటించాడు.

ఈ సినిమాల్లో రామ్మోహన్ రావు ని చూసిన వారంతా కూడా ఆంధ్ర దేవానంద్ అంటూ ఆకాశానికి ఎత్తేసేవారు.దాంతో అతడు నిజంగానే దేవానంద్ అనే ఫీల్ లో ఉండేవాడు అలాగే అతడు హీరో రోల్ తప్ప మరో రూల్స్ చేయడానికి ఇష్టపడేవాడు కాదు.దాంతో ఆ తర్వాత వచ్చిన రెండు మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో అడ్రస్ లేకుండా పోయాడు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఆ తర్వాత హైదరాబాద్ కి కూడా మకాం మార్చిన ఏమి ఉపయోగం లేదు.చివరగా రామ్మోహన్ రావు ఆర్థికంగా పూర్తిగా చితికిపోయాడు చివరినాల్లలో బ్రతకడానికి ట్యూషన్లు కూడా చెప్పుకున్నాడు.

Advertisement

అలా 2005 లో కన్నుమూశాడు.

తాజా వార్తలు