దాసరికి షాక్ ఇచ్చిన కోట శ్రీనివాస్ రావు.. చివరికి అయన ఏమన్నారో తెలుసా.. ?

కోటా శ్రీనివాసరావు

.విలన్ గా, క్యారెక్టర్ ఆర్టటిస్టుగా, కమెడియన్ గా అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్న నటుడు.

ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోయిన నటిస్తాడు ఆయన.కోటా కెరీర్ తొలినాళ్లలో చక్కటి నటనతో ఎన్నో అకాశాలు పొందాడు.ఆ సమయంలో జరిగిన ఓ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో కృష్ణం రాజు హీరోగా ఓ సినిమా షూటింగ్ జరుగుతోంది.రాజమండ్రి దగ్గర పూడిపల్లిలో చిత్రీకరణ ప్రారంభం అయ్యింది.

ఈ సినిమాలో సత్యనారాయణ కోసం దాసరి ఓ క్యారెక్టర్ రూపొందించాడు.కానీ ఆయన అందుబాటులో లేడు.

Advertisement
Untold Facts About Dasari And Kota , Dasari Narayana Rao, Kota , Kota Srinivasa

ఈ పాత్రకు ఎవరిని తీసుకుంటే బాగుంటుంది? అని ఆలోచించాడు.ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న కోటా శ్రీనివాసరావు అయితే బాగుంటుంది.

అని ఎవరో చెప్పారు.కానీ సినిమాలో కీలక పాత్రను కొత్త నటుడితో చేయించడం సరికాదు అనుకున్నాడట.

కానీ వేరే అవకాశం లేక తనను ఓకే చేశాడట.మరుసటి రోజు ఉదయం 7 గంటలకే సినిమా షూటింగ్ స్పాట్ కు వచ్చి మేకప్ వేసుకుంటున్నాడడట.

కోటా మంచి క్రమశిక్షణ కలిగిన నటుడు అని అనుకున్నాడట.షూటింగ్ అయిపోవచ్చింది.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!

సాయంత్రం అవుతుంది.సెట్ బయట పలువురు మేనేజర్లు ఎదురు చూస్తున్నారు.

Untold Facts About Dasari And Kota , Dasari Narayana Rao, Kota , Kota Srinivasa
Advertisement

అప్పట్లో దాసరి నారాయణ రావు కోసం పలువురు మేనేజర్లు ఎదురు చూసేవారు.వాళ్లను లోపలికి రమ్మన్నాడు దాసరి.ఐదారుగురు వచ్చి కూర్చున్నారు.

వాళ్లు తన కోసమే వచ్చారని భావించి.నేను కాస్త బిజీగా ఉన్నాను.

తర్వాత కలుద్దాం అని చెప్పాడు.కానీ వారిలో ఒకరు మేం వచ్చింది మీకోసం కాదండీ.

కోటా కోసం అని చెప్పాడు.దాసరి షాక్ అయ్యాడు.

వచ్చిన వారంతా అతడి కోసమే అని చెప్పారు.కొత్తగా వచ్చిన నటుడి కోసం ఇంత మంది వచ్చారా? అని ఆశ్చర్యపోయాడు.ఇంతకీ విషయం ఏంటి? కోటాతో ఏం పని? అని అడిగాడు.

మా అందరికీ ఆయన డేట్లు కావాలి.ఆయన కాల్షీట్లు ఎవరు చూస్తున్నారో తెలియదు.అందుకే ఇక్కడికి వచ్చాం అన్నారు.

దాసరికి విషయం అర్థం అయ్యింది.కోటాను పిలిచాడు.

నువ్వు గొప్ప నటుడివి అవుతావు అని చెప్పాడు.తెలుగులో మరో ఎస్వీఆర్ గా మారుతావు అని చెప్పాడు.

అక్కడే ఉన్న సీనియర్ మేనేజర్ జ్యోతి ప్రసాద్ ను పిలిచి కోటా డేట్లు చూడాలని చెప్పాడు.మంచి స్థాయికి వెళ్లే నటుడు.

జాగ్రత్తగా డేట్లు చూడు అని చెప్పాడు.

తాజా వార్తలు