తెలంగాణలో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కురిసిన వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థమైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది.సుమారు రెండు గంటల్లోనే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి.
గాలుల తీవ్రతతో విద్యుత్ తీగలపై పలు చెట్లు విరిగిపడటంతో పాటు హోర్డింగులు పడిపోయాయి.ఇటు జిల్లాల్లో అకాల వర్షాలకు పంటలు నాశనం అయ్యాయి.
దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.మరోవైపు తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ ప్రకటించింది.