బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలయ్యింది.ఈ షోకీ సంబంధించిన మొదటి ఎపిసోడ్ తాజాగా జరిగిన విషయం తెలిసిందే.
ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ నిన్నటి నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో స్ట్రీమింగ్ అవుతోంది.మొదటి ఎపిసోడ్ కి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ హాజరయ్యారు.
ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ వియ్యంకులు వాళ్ళతో ఎన్నో విషయాలను ముచ్చటించారు.కొన్ని సీరియస్ విషయాలను అలాగే ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి కూడా చర్చించుకున్నారు.
ఇక తాజాగా జరిగిన ఎపిసోడ్ లో నారా లోకేష్ ఎంట్రీ, బాలయ్య బాబు స్టైల్, అలాగే చంద్రబాబు చేసిన ఎమోషనల్ అండ్ ఫన్నీ కామెంట్స్ లోకి హైలెట్ గా నిలిచాయి.ఈ నేపథ్యంలోనే కేవలం రాజకీయాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా ఎన్నో విషయాల గురించి ముచ్చటించారు.
ఈ నేపథ్యంలోనే సీనియర్ ఎన్టీఆర్ తో జరిగిన గొడవ విషయం గురించి కూడా తెలిపారు చంద్రబాబు నాయుడు.ఇది ఇలా ఉంటే షో మధ్యలో బాలకృష్ణ కూతురు చంద్రబాబు నాయుడు కోడలు ఆయన నారా బ్రహ్మానికి ఫోన్ చేశారు.
అప్పుడు బాలకృష్ణ చంద్రబాబు నాయుడు ఫోన్ తీసుకొని ఫోన్లో బ్రహ్మని పేరును ఏమని ఫీడ్ చేసావ్ బావ అని అడగగా నారా బ్రాహ్మణి అని చంద్రబాబు అనడంతో వెంటనే బాలకృష్ణ నందమూరి కూడా బావ అన్నారు.
ఇక ఫోన్ లిఫ్ట్ చేయగానే బ్రహ్మని గుడ్ ఆఫ్టర్ నూన్ మామయ్య అని చెప్పింది.అప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేను బాలయ్య షో లో ఉన్నాను నాతో బాలయ్య ఆటలు ఆడుకుంటున్నారు అంటూ ఫన్నీగా మాట్లాడాడు.అప్పుడు వెంటనే బాలకృష్ణ తనకు తన కూతురు అంటే భయం అని తెలిపారు.
అప్పుడు బ్రహ్మణి బాలకృష్ణ తో మాట్లాడుతూ నాన్న అండ్ స్టాపబులతో పాటుగా అన్ కంట్రోలబుల్ అంటూ కామెంట్స్ చేసింది.అప్పుడు చంద్రబాబు నాయుడు కోడలు గురించి మాట్లాడుతూ బ్రహ్మణి చాలా పవర్ఫుల్ లేడీ అంటూ మెచ్చుకున్నారు.