వైసీపీ ఎంపీ ఇంటి పై రాళ్ల దాడి

విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు 2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా విజయం సాధించి యువ ఎంపీ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

తాజాగా శ్రీ కృష్ణ దేవరాయలు ఇంటిపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేయడంతో ఆయన ఇంటి అద్దాలు పగిలాయి.

తక్షణమే ఎంపీ ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందిగా వాచ్ మెన్ ను దుండగులు బెదిరించారు.ఈ సంఘటనపై వాచ్ మెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు మొదలుపెట్టారు.

Unknown People Narasaraopeta Mp House From Ysrcp-వైసీపీ ఎంప�

ఇది ఆకతాయిల పనా లేక రాజకీయ ప్రత్యర్థులు ఈ విధంగా భయబ్రాంతులకు గురి చేస్తున్నారా అనే విషయంపై పోలీసులు విచారణ మొదలుపెట్టారు.అయితే ఈ పరిణామం వైసీపీలో కలకలం రేపింది.

పలువురు శ్రీ కృష్ణ దేవరాయలకు ఫోన్ చేసి విషయం ఆరా తీస్తూ పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు