లతమంగేష్కర్ మరణానికి ముందు.. ఇంత జరిగిందా?

దశాబ్దాల పాటు తన గాత్రంతో ప్రేక్షకులందరినీ కూడా మంత్రముగ్ధులను చేసిన గానకోకిల, లెజెండరీ సింగర్, భారతరత్న లతా మంగేష్కర్ ఇటీవలే అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

ఇక లతమంగేష్కర్ మరణంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

కరోనా, నిమోనియా లాంటి సమస్యలతో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రిలో చేరారు ఆమె.గత కొన్ని రోజుల క్రితం వరకూ ఎంతో యాక్టివ్ గా ఉన్న లతమంగేష్కర్ ఆసుపత్రిలో చేరడం తో స్వల్ప అస్వస్థత అయి వుంటుందని వెంటనే ఆమె చికిత్స తీసుకొని కోలుకుంటారు అని అభిమానులు ధీమాతోనే ఉన్నారు.కానీ ఊహించని రీతిలో ఆమె ఆరోగ్యం క్రమ క్రమంగా క్షీణిస్తూ వచ్చింది.

చివరికి ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.మృతి పై ఎంతో మంది సినీ రాజకీయ క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

అయితే ప్రస్తుతం ఆమెకు నిమోనియా తో పాటు కరోనా వ్యాధి సోకడం కారణంగా పరిస్థితి విషమించిందని డాక్టర్లు చెబుతున్నారు.అయితే లతమంగేష్కర్ మరణానికి వీటితో పాటు మరో సమస్య కూడా ఉందన్నది తెలుస్తోంది.

Advertisement
Unknown Facts Behind Latha Mangeshkar Death , Latha Mangeshkar , Ganakokila, Leg

ఆమె శరీరంలో మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవ్వడం కారణంగానే ఇక డాక్టర్లు చికిత్స అందించినప్పటికీ ఆమె బ్రతకలేదని.ఆమె శరీరంలోని అన్ని అవయవాలు పనిచేయని స్థితికి చేరుకున్నాయి అని చెబుతున్నారు వైద్యులు.

Unknown Facts Behind Latha Mangeshkar Death , Latha Mangeshkar , Ganakokila, Leg

గత నెల 28వ తేదీన వెంటిలేటర్పై లతా మంగేష్కర్ వుండగా ఆరోగ్యం మెరుగుపడుతుంది అని వైద్యులు తెలిపారు.వెంటిలేటర్ పై తొలగించినట్లు చెప్పారు.దీంతో అభిమానులు అందరూ ఎంతగానో సంతోష పడి పోయారు.

మరికొన్ని రోజుల్లో లతా మంగేష్కర్ కోలుకుంటారు అని అనుకున్నారు.కానీ అంతలోనే మళ్లీ ఆరోగ్యం విషమించడంతో వెంటిలేటర్పై కి మార్చారు.

చివరికి చికిత్సపొందుతూ లతా మంగేష్కర్ ఈ లోకాన్ని విడిచిపోయారు.

నెలలో రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే 60 లోనూ తెల్ల జుట్టు దరిచేరదు!
Advertisement

తాజా వార్తలు