శ్రీదేవి చెల్లి శ్రీలతను లాగి పెట్టి కొట్టిందెవరు .. ?

అతిలోక సుందరి శ్రీదేవి.ఆమెకు ఓ చెల్లి ఉందని.

ఆమె కూడా కొన్ని సినిమాల్లో నటించింది చాలా మందికి తెలియదు.

చాలా మంది మహేశ్వరిని తన సొంత చెల్లిగా భావిస్తుంటారు.

కానీ అది నిజం కాదు.తను కజిన్ సిస్టర్.

శ్రీదేవి సొంత చెల్లి శ్రీలత.శ్రీదేవి ముంబైకి వెళ్లడానికి ముందు వరకు చెన్నైలో ఉన్నంత కాలం శ్రీలత అంటే శ్రీదేవికి ప్రాణం.

Advertisement
Unknown Facts About Sridevi Sister Srilatha, Sridevi Sister, Srilatha, Srilatha

తన చెల్లే తనకు బెస్ట్ ఫ్రెండ్ అని శ్రీదేవి చాలా సార్లు వెల్లడించింది.సినిమాల్లో శ్రీదేవి మోడ్రన్ డ్రెస్టులు వేసుకుంటే.

అవి తనకు కావాలని తల్లి దగ్గర మారాం చేసేది శ్రీలత.తెచ్చేంత వరకు ఇద్దరు కొట్లాడుకునేవారట.

శ్రీదేవి నటించిన సినిమాలను అక్కాచెల్లెల్లు కలిసి చూడ్డానికి వెళ్లేవారు.ఎమోషనల్ సీన్ లో ఏడిస్తే శ్రీదేవిని శ్రీలత టీజ్ చేసేది.

ఇద్దరు కలిసి సినిమా హాల్లోనే కొట్లాడే వారు.మళ్లీ ఒక్కటిగా ఇంటికి వచ్చేవారు.

అందాన్ని పెంచే అర‌టి ఆకు.. ఎలా వాడాలో తెలుసా?

సినిమా షూటింగ్ అయ్యాక ఎంత సేపటికి ఇంటికి వచ్చిన చెల్లితో తప్పకుండా మాట్లాడాకే పడుకునేది.తను ముందుగా నిద్రపోయిన రోజు అస్సలు శ్రీదేవికి నిద్ర పట్టేది కాదు.

Advertisement

సినిమా షూటింగుల దగ్గరికి వెళ్లడం శ్రీలతకు అస్సలు ఇష్టం ఉండేది కాదు.

Unknown Facts About Sridevi Sister Srilatha, Sridevi Sister, Srilatha, Srilatha

కానీ శ్రీదేవి తనను బలవంతంగా తీసుకెళ్లేది.శ్రీదేవికి అమ్మంటే ఇష్టం కాగా.శ్రీలతకు నాన్నంటే ఇష్టం.

ఈ ఇద్దరు కలిసి ఓ తెలుగు సినిమాలో కలిసి నటించారు.ఆ సినిమాలో శ్రీ‌ల‌త‌ను ఒకామె కొట్టే సీన్ ఉంటుంది.

అక్కడే శ్రీదేవి కూడా ఉంది.ఆమెను గట్టిగా చెంపమీద కొట్టడంతో తను వెక్కివెక్కి ఏడ్చింది.

శ్రీదేవి తట్టుకోలేకపోయింది.

కొంత కాలం తర్వాత సంజ‌య్ రామ‌స్వామి అనే వ్య‌క్తిని శ్రీ‌ల‌త వివాహం చేసుకుంది.చాలా ప్రేమగా ఉండే వీరి మధ్య ఆస్తి గొడవలు వచ్చాయి.దాదాపు పదేండ్ల పాటు వీరి మధ్య మాటలు లేవు.

బోనీ కపూర్ చొరవతో ఇద్దరు మళ్లీ దగ్గరయ్యారు.శ్రీదేవి దుబాయ్ లో చనిపోయినప్పుడు తను కూడా అక్కడే ఉంది.

అప్పట్లో తన మరణానికి సంబంధించి పలు విషయాలు వెల్లడిస్తుందని వార్తలు వచ్చాయి.కానీ శ్రీలత ఈ విషయం గురించి ఎలాంటి విషయాలు వెల్లడించలేదు.

తాజా వార్తలు