కోట్ల రూపాయల భూములు దానం చేసిన ప్రభాకర్ రెడ్డి కూతుర్లకు కట్నం ఎంత ఇచ్చాడో తెలుసా ?

నటుడు ప్రభాకర్ రెడ్డి. రచయితగా, వైద్యుడిగా, నటుడిగా టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించుకున్న ప్రభాకర్ రెడ్డి సూర్యాపేట జిల్లాకు చెందిన వ్యక్తి.

తులుత వైద్యవృత్తిలో ఉన్న ప్రభాకర్ రెడ్డికి నాటకాల్లో నటించాలనే ఆసక్తి కలగడంతో ఈ రంగంలోకి ప్రవేశించాడు.హిందీ, తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించినా ప్రభాకర్ రెడ్డి తన 37 ఏళ్ల కెరియర్ లో 500 కు పైగా సినిమాల్లో నటించాడు.

దర్శకుడిగా, నిర్మాతగా మారి సినిమాలు సైతం తీశాడు.అధినాయక పాత్రలోనే ఎక్కువగా కనిపించిన ప్రభాకర్ రెడ్డి అద్భుతమైన వైద్యుడు కూడా.

ఏకకాలంలో నటనను, వైద్య వృత్తిని కొనసాగించాడు.సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి హైదరాబాద్ రావడంతో 90 లలో హైదరాబాద్ కి తనమకాం మార్చారు.

Advertisement
Unknown Facts About Actor Prabhakar Reddy Details, Prabhakar Reddy, Actor Prabha

అంతేకాదు హైదరాబాదులో స్టూడియోలు నిర్మించడం, సినిమా హాల్స్ కట్టడం లాంటివి చేశారు.కార్మికుల కోసం ఏకంగా తన పది ఎకరాల పొలాన్ని దానం చేశాడు అది కూడా ఉచితంగా.

చిత్రపురి కాలనీలో ఉంటున్న ఆ భూమికి ఇప్పుడు కొన్ని వందల కోట్ల విలువ ఉంది.చిత్రపురి కాలనీ ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డి చిత్రపురి కాలనీ అని కూడా పిలుస్తుంటారు.

అలాగే మణికొండలో ఆయన పేరు మీదుగా ప్రభాకర్ రెడ్డి చలనచిత్ర కార్మిక చిత్రపురి అనే పేరును సైతం పెట్టారు.

Unknown Facts About Actor Prabhakar Reddy Details, Prabhakar Reddy, Actor Prabha

ఇలా ఎన్నో గుప్తదానాలు చేసిన ప్రభాకర్ రెడ్డి తన వ్యక్తిగత జీవితం మాత్రం ఏనాడు బయట ప్రపంచానికి తెలియనివ్వలేదు.ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు.కోట్ల విలువ చేసే భూములను దానంగా ఇచ్చిన ప్రభాకర్ రెడ్డి తన కూతుర్లకు మాత్రం పెళ్లిళ్ల సమయంలో చిల్లి గవ్వ కూడా కట్టంగా ఇవ్వలేదు.

పైసా ఖర్చు లేకుండా ఈ మ్యాజికల్ హోమ్ మేడ్ సీరం తో తెల్లగా మెరిసిపోండి!

ప్రభాకర్ రెడ్డి పై ఉన్న గౌరవంతోనే ఆయన కుమార్తెలను వివాహం చేసుకోవడానికి కొంత ఉన్నత కుటుంబాల నుంచి సంబంధాలు రావడంతో పెళ్లిళ్లు జరిపించారు.అలా ఆయన పేరు సుస్థిరంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిగిలిపోయింది.

Advertisement

ఇప్పటికీ కొన్ని వేల మంది ఆయనను తలుచుకొని హాయిగా జీవిస్తున్నారు.

తాజా వార్తలు