మామిడి ఆకులతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

వేసవికాలం వచ్చిందంటే మామిడి పండ్లు అధికంగా వస్తాయి.అంతేకాక మామిడి పండ్లను తినటానికి కూడా అందరు ఆసక్తి కనబరుస్తారు.

మామిడిపండు ఎంత రుచిగా ఉంటుందో అదే స్థాయిలో పోషకాలు కూడా ఉంటాయి.మామిడి పండులో విటమిన్ ఎ, బి, సిల‌తోపాటు పొటాషియం, కాప‌ర్‌, మెగ్నిషియం, ఫ్లేవ‌నాయిడ్స్‌, సాపోనిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్స్ సమృద్ధిగా ఉండుట వలన మన శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

అలాగే మామిడి ఆకులలో ఎన్నో ఆరోగ్య సమస్యలను పరిస్కారం చేసుకోవచ్చు.మీకు ఆశ్చర్యం కలుగుతుంది కదా.కానీ ఇది నిజం.ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

అయితే మామిడి ఆకులను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.కొన్ని మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించి టీ డికాషన్ గా తయారు చేసుకోవాలి.

Advertisement
Unknown Benefits Of Mango Leaves , Mango Leaves , Summer , Health Isseus , Decoc

ఈ టీ డికాషన్ ని రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

మామిడి ఆకులు బీపీని తగ్గించటంలో బాగా సహాయపడతాయి.మామిడి ఆకుల డికాషన్ తాగితే బిపి కంట్రోల్ లో ఉంటుంది.

మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు ఈ మామిడి ఆకుల డికాషన్ త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి.దాంతో మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

అంతేకాక జ‌లుబు, బ్రాంకైటిస్‌, ఆస్తమా వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌ల నుండి మంచి ఉపశమనం కలుగుతుంది.

Unknown Benefits Of Mango Leaves , Mango Leaves , Summer , Health Isseus , Decoc
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఈ డికాషన్ చెవి నొప్పిని తగ్గించటంలో బాగా సహాయపడుతుంది.ఈ డికాషన్  వేడిగా ఉన్నప్పుడే రెండు చుక్కలు చెవిలో వేస్తే  చెవి నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.మామిడి ఆకులను కాల్చి బూడిద చేయాలి.

Advertisement

ఈ బూడిదను గాయాలకు రాస్తే గాయాలు తొందరగా నయం అవుతాయి.గౌట్ సమస్యను తగ్గించటంలో మామిడి ఆకులు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.

అయితే ప్రతి రోజు క్రమం తప్పకుండా ఈ డికాషన్ ని త్రాగాలి.అప్పుడే మంచి ఫలితం కనపడుతుంది.

తాజా వార్తలు