పెరుగుతున్న పెట్రోల్ ధరలపై వివరణ ఇచ్చిన కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి.. !

ప్రస్తుతం భారత దేశంలో పేదవాడు బ్రతకలేని పరిస్దితులు నెలకొన్నాయి.దీనికి కారణం అదుపు లేకుండా పెరుగుతున్న ధరలు అన్న విషయం అందరికి తెలిసిందే.

చాలీచాలనీ సంపాదనతో బ్రతుకీడుస్తున్న మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలు కన్నీటితో కడుపు నింపుకునే పరిస్దితులు తలెత్తాయి.అయితే విచ్చలవిడిగా పెరుగుతున్న పెట్రోల్ ధరల విషయం పట్ల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు.

Union Petroleum Minister Gives Explanation On Rising Petrol Prices, Union Minist

దేశంలోని పెట్రోల్ ధరలు ప్రజలకు ఇబ్బందిగా మారిన విషయాన్ని అంగీకరిస్తూనే ఇలా ధరలు పెరగడానికి కారణం సంక్షేమ పథకాలకు నిధులు సర్దుబాటు చేస్తుండటం అని వెల్లడించారు.అదీగాక కరోనా వ్యాక్సిన్ల కోసమే రూ.35,000 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.ఇకపోతే బీజేపీ ఏదో ప్రజలకు మేలు చేస్తుందని భావిస్తే ప్రజలను బర్రెలుగా చేసి రక్తాన్ని పిండుకుంటున్నారని ప్రభుత్వాలతో నరకాన్ని చూస్తున్న ప్రజలు అనుకుంటున్నారట.

ఇక ఈ మధ్య కాలంలో చమురు ధరలు 23 సార్లు పెరిగిన విషయం గమనించే ఉంటారు.

Advertisement
అధిక బరువుతో వర్రీ వద్దు.. నిత్యం ఈ హెర్బల్ వాటర్ ను తాగితే నెల రోజుల్లో సన్నబడతారు!

తాజా వార్తలు