ఖమ్మం నగరంలో కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్ పర్యటన..!

లోక్ సభ ఎన్నికలు( Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ బీజేపీ గెలుపే ధ్యేయంగా తీవ్ర కసరత్తు చేస్తుంది.

ఇందులో భాగంగా జాతీయ నేతలతో ప్రచారాలను నిర్వహిస్తుంది.

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్( Rajnath Singh ) హాజరయ్యారు.ఆ కార్యక్రమం అనంతరం ఆయన ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు.

ఈ క్రమంలోనే ఖమ్మం నగరంలో కేంద్రమంత్రి రాజ్‎నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు( BJP Candidate Tandra Vinod Rao ) విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

కాగా ఎన్ఎస్జీ బలగాల భద్రత నడుమ రాజ్ నాథ్ సింగ్ పర్యటన కొనసాగుతోంది.బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ అవినీతి పార్టీలేనని విమర్శించారు.

Advertisement

మోదీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని.చేతల ప్రభుత్వమని తెలిపారు.

మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత పేదరికం పోయిందని చెప్పారు.మ్యానిఫెస్టోలో చెప్పినట్లే అయోధ్యలో రామమందిరం నిర్మించామన్నారు.

మహిళలకు గౌరవం ఉండాలని చట్టాలు చేశామని వెల్లడించారు.

ఇదేం శ్యాడిజం.. స్కూటీని ఢీ కొట్టడమే కాకుండా అమాంతం ఈడ్చుకెళ్లిన కారు..
Advertisement

తాజా వార్తలు