కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ విశాఖకు రానున్నారు.పర్యటనలో భాగంగా మహా సంపర్క్ అభియాన్ పేరుతో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అమిత్ షా ప్రసంగించనున్నారు.సభ ముగిసిన అనంతరం రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు.
ఇందులో భాగంగా ఏపీ పరిస్థితులతో పాటు రాజకీయ పరిణామాలపై నాయకులు చర్చించనున్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.