తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టిటిడి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, ఏపి ఆర్ధిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ లు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అనంతరం స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.
ఆలయ వెలుపల వచ్చిన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఎగబడ్డారు.తమిళనాడు నుండి దర్శనంకు విచ్చేసిన ఓ తమిళ యువకుడితో నిర్మలా సీతారామన్ ముచ్చటించి స్వామి వారి లడ్డూ ప్రసాదంను అందించారు.
అనంతరం పద్మావతి అతిధి గృహం చేరుకుని అల్పాహారం స్వీకరించి తిరుపతిలోని జరుగనున్న ట్యాక్స్ అడ్వైజరీ కమిటీ సమావేశంకు కేంద్ర మంత్రి హాజరు కానున్నారు.