సమాజంలో రాజకీయ పోరు, వర్గ పోరు చాలా ప్రమాదం అని ఎన్నో సార్లు నిరూపించబడింది.వీటి వల్ల ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.
అయినా గానీ ప్రాణం కంటే పరపతి ఎక్కువని భావించే వారు లేక పోలేదు.ఇకపోతే ఏపీలో అయితే వర్గపోరు ఎప్పటి నుండో ఉన్న విషయం తెలిసిందే.
ఫ్యాక్షనిజం తగ్గుముఖం పట్టాక వర్గ పోరుకు ప్రాధాన్యత పెరిగింది.టీడీపీ హాయమంలో కానివ్వండి, వైసీపీ హయామంలో కానివ్వండి ఒకరు మీద ఒకరు దాడులు చేసుకోవడం మాత్రం ఆగిపోలేదు.
ఇక ఏపీలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడుత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ గడువు కొద్ది సేపటి క్రితం ముగిసింది.కానీ వర్గపోరు మాత్రం మొదలైంది.
చిత్తూరు జిల్లాలోని యాదమర్రి ఎంపీడీవో కార్యాలయం సమీపంలో, టీడీపీ ఎమ్మెల్సీ దొరబాబు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారట.నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించడానికి వెళ్ళిన, ఎమ్మెల్సీ దొరబాబు వాహనం పై, పలువురు కర్రలు, రాళ్లతో దాడి చేశారని సమాచారం.
అయితే ఈ దాడికి పాల్పడింది వైకాపా నేతలే అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.కాగా వైసీపీ నేతలు కూడా దొరబాబు తన కారుతో తమ పార్టీ వారిని గుద్దించారని ఆరోపణలు చేస్తున్నారు.
ఇలా ఇరు పార్టీల నాయకులు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారట.







