గూగుల్ పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు..!

ప్రముఖ స్మార్ట్ ఫోన్లో తయారీ సంస్థ గూగుల్ నుంచి పిక్సెల్ 8 సిరీస్ స్మార్ట్ ఫోన్ విడుదల అయిన సంగతి తెలిసిందే.

అయితే పిక్సెల్ 7 సిరీస్ స్మార్ట్ ఫోన్లపై గూగుల్ ఊహించని డిస్కౌంట్ ప్రకటించింది.

గూగుల్ పిక్సెల్ 7, పిక్సెల్ 7A, పిక్సెల్ 7ప్రో స్మార్ట్ ఫోన్లపై ఎంత మేరకు డిస్కౌంట్ ఉందో అనే వివరాలను తెలుసుకుందాం.గూగుల్ పిక్సెల్ 7: ఈ స్మార్ట్ ఫోన్ 6.3 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్ ప్లే తో ఉంటుంది.90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది.ఆండ్రాయిడ్ 13పై పని చేస్తుంది.50MP+ 12MP కెమెరాలతో ఉంటుంది.సెల్ఫీ కోసం ముందు భాగంలో 10.8 MP కెమెరాతో ఉంటుంది. 20w చార్జింగ్ సపోర్ట్ తో 4270 mAh బ్యాటరీ సామర్థ్యం తో ఉంటుంది.

ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ విషయానికి వస్తే.సెలెక్టెడ్ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.2 వేల రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు.ఎంపిక చేసిన స్మార్ట్ ఫోన్లను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా రూ.6000 వరకు తగ్గింపు పొందవచ్చు.

గూగుల్ పిక్సెల్ 7A: స్మార్ట్ ఫోన్ 6.1 అంగుళాల ఫుల్ HD+OLED డిస్ ప్లే తో ఉంటుంది.90Hz రిఫ్రెష్ రేటు తో వస్తుంది.ఆండ్రాయిడ్ 13పై పనిచేస్తుంది.64MP OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్+ 13MP అల్ట్రా వైడ్ తో పాటు 13MP సెల్ఫీ కెమెరాతో ఉంటుంది.4300mAh బ్యాటరీ సామర్థ్యంతో ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ విషయానికి వస్తే.సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల నుంచి కొనుగోలు చేస్తే రూ.2 వేల రూపాయలు తగ్గింపు పొందవచ్చు.ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో రూ.3 వేల రూపాయలు తగ్గింపు పొందవచ్చు.

Advertisement

గూగుల్ పిక్సెల్ 7ప్రో: ఈ స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల QHD+ OLED డిస్ ప్లే తో ఉంటుంది.120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది.50MP+ 12MP+ 48MP కెమెరాలతో ఉంటుంది.సెల్ఫీ కోసం 10.8 కెమెరాతో ఉంటుంది.23w చార్జింగ్ సపోర్ట్ తో 4926 mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.ఈ స్మార్ట్ ఫోన్ పై డిస్కౌంట్ విషయానికి వస్తే.సెలెక్టెడ్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల తగ్గింపు, ఎక్సేంజ్ ఆఫర్ కింద మరో రూ.4వేల డిస్కౌంట్ పొందవచ్చు.

వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..
Advertisement

తాజా వార్తలు