ఉండి టీడీపీ టికెట్ నాదే..: ఎమ్మెల్యే రామరాజు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యే రామరాజు( TDP MLA Rama Raju ) కీలక వ్యాఖ్యలు చేశారు.

ఉండి నియోజకవర్గ టికెట్ పై పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) వద్ద చర్చ జరగలేదని తెలిపారు.

ఉండి నియోజకవర్గ( Undi Constituency ) సీటును ఇప్పటికే పార్టీ తనకు కేటాయించిందని పేర్కొన్నారు.కొందరు కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఉండి సీటుపై మొదటి నుంచి లేనిపోని అలజడి సృష్టిస్తున్నారని తెలిపారు.పార్టీ అధిష్టానం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న రామరాజు తాను పోటీలో ఉన్నట్లేనని వెల్లడించారు.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు