శంకుస్థాపన ఎప్పుడో....?

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుప్థాపన ఎప్పుడో తెలియడంలేదు.జూన్‌ ఆరో తేదీన శంకుస్థాపన చేద్దామనుకున్నారు.

కాని ఈలోగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డం వచ్చింది.కోడ్‌ అడ్డం వచ్చింది కాబట్టి శంకుస్థాపన చేయాలంటే ఎన్నికల కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి.

Uncertainty On AP Capital’s Foundation-Uncertainty On AP Capital#8217;s Fo

ఒక్కసారి కోడ్‌ అమల్లోకి వచ్చాక అనుమతి ఇవ్వడం కష్టం.ఇప్పుడు అనుమతి ఇస్తే ఇదొక సంప్రదాయంగా స్థిరపడిపోతుంది.

భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు అనుమతి అడుగుతాయి.అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం అనుకున్న తేదీనే రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కొందరు అధికారులు చెబుతున్నారు.

Advertisement

ఎన్నికల సపంఘం అనుమతి ఇస్తుందనే నమ్మకం సర్కారుకు ఉన్నట్లుగా కనిపిస్తోంది.ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈమధ్య వాస్తు పిచ్చి, ముహూర్తాల పిచ్చి బాగా పట్టుకుంది.

శంకుస్థాపన కోసం పండితులను సంప్రదించి బ్రహ్మాండమైన ముహూర్తం పెట్టించి ఉంటారు.అది తప్పిపోతే ఏమైనా అనర్థాలు జరుగుతాయనే భయం ఉండొచ్చు.

మరి సీఎం చంద్రబాబు ఏవిధంగా మేనేజ్‌ చేస్తారో.తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోర అవమానం పాలవడమే కాకుండా, నాయకుడు రేవంత్‌ రెడ్డి కూడా లంచం ఇవ్వబోయి ఏసీబీకి చిక్కాడు.

కాబట్టి అనుకున్న ముహూర్తానికి శంకుస్థాపన జరగకపోతే ఆంధ్రా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైనా జరుగుతుందనే భయం ఉండొచ్చు.ముహూర్త బలం గొప్పందంటారు కదా.!.

Advertisement

తాజా వార్తలు