టాలీవుడ్ లో అరుదైన రికార్డులు తన సొంతం చేసుకున్న రామ్! అవేంటో తెలుసా ?

టాలీవుడ్ యంగ్ హీరో రామ్.కొద్ది సినిమాలే చేసినా.చక్క‌టి గుర్తింపు పొందాడు.

తొలుత‌ క్లాస్ సినిమాలు చేసిన ఈ హ్యాండ్స‌మ్ గాయ్.పూరీ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ పేరుతో మాస్ సినిమా చేశాడు.

ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ పొందాడు.అయితే ఈ సౌతిండియ‌న్ కుర్రాడు చేసిన సినిమాలు ప‌లు రికార్డుల‌ను సృష్టించాయి.

ఇంత‌కీ ఆ రికార్డులు ఏంటో ఇప్ప‌డు చూద్దాం! ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ నుంచి ఓ హీరో సినిమాలు హిందీలో డ‌బ్ కాబ‌డిన 6 సినిమాలు యూట్యూబ్ 100 మిలియన్ల వ్యూస్ వ‌చ్చిన ఏకైక న‌టుడు రామ్.ఇక్క‌డ మామూలుగా ఆడిన ఆయ‌న సినిమాలు హిందీలోకి డ‌బ్ అయ్యి యూట్యూబ్ హ‌ల్ చ‌ల్ సృష్టిస్తున్నాయి.

Advertisement

ఉత్త‌రాది ప్రేక్ష‌కుల నుంచి ఆయ‌న‌కు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.*రామ్ న‌టించిన నేను శైలజ సినిమా హిందీలో సూపర్ ఖిలాడి-3 టైటిల్ తో యూట్యూబ్ లో విడుద‌ల చేశారు.

ఈసినిమాను ఇప్ప‌టి వ‌ర‌కు 27 కోట్ల మందికి పైగా చూశారు.*తెలుగు ప్రేక్ష‌కుల‌కు అంత‌గా ఎక్క‌ని ఉన్న‌ది ఒక్కటే జింద‌గి సినిమా.

హిందీలోకి నెంబర్ వన్ దిల్వాలే పేరుతో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాకు 19 కోట్ల వ్యూస్ రావ‌డం విశేషం.

*రామ్ మ‌రో సినిమా హలో గురు ప్రేమ కోసమే సినిమా ద‌మ్ దార్ ఖిలాడి పేరుతో రిలీజ్ అయ్యింది.ఈ సినిమాను 25 కోట్ల మంది చూసారు.*

ఇష్మార్ట్ శంకర్ సినిమా

ను అదే పేరుతో హిందీలో రిలీజ్ చేశారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఈ సినిమాను 14 కోట్ల మంది చూసారు .*అటు రామ్ గ‌ణేష్ సినిమా కూడా తాజాగా 100 మిలియ‌న్ వ్యూస్ దాటింది.రామ్ హీరోగా న‌టించిన ప‌లు చిత్రాలు 100 మిలియ‌న్ వ్యూస్ దాటాయి.

Advertisement

సౌత్‌లో మ‌రే హీరోకు ఈ ఘ‌న‌త ద‌క్క‌లేదు.

తాజా వార్తలు