ఉల్లాసంగా ఉత్సాహంగా హీరో సాగర్ చనిపోవడానికి అదే కారణం: సూర్య

సాధారణంగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వస్తుంటారు ఇలా తపన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు పింగ్ పాంగ్ సూర్య.

ఈ సినిమా అనంతరం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

అలాగే బాహుబలి సినిమాలో కూడా ఈయన ఎంతో కీలక పాత్రలో నటించారు.ఇలా ఎన్నో సినిమాలలో హీరో ఫ్రెండ్ పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సూర్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని సన్నివేశాలను అందరితో పంచుకున్నారు.అదేవిధంగా ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమాలో కూడా హీరో సాగర్ ఫ్రెండ్ పాత్రలో నటించి సందడి చేశారు.

ఉల్లాసంగా ఉత్సాహంగా సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.కన్నడ ప్రొడ్యూసర్ కుమారుడైన యశోసాగర్.

Advertisement
Hero Sagar ,Surya,Ullāsaṅgā Utsāhaṅgā,Yashosagar. Sneha Ullal ,Keshav S

డైరెక్టర్ కరుణాకరన్ దర్శకత్వంలో స్నేహ ఉల్లాల్ కేశవ్ సాగర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ఉల్లాసంగా ఉత్సాహంగా.

Hero Sagar ,surya,ullāsaṅgā Utsāhaṅgā,yashosagar. Sneha Ullal ,keshav S

ఈ సినిమాలో హీరోగా నటించిన సాగర్ కు ఎంతో మంచి గుర్తింపు లభించింది ఇప్పటికీ ఈ సినిమా చూస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు కడుపుబ్బ నవ్వుకుంటారు.ఇక ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ పాత్రలో చేశారు పింగ్ పాంగ్ సూర్య.ఈ క్రమంలోనే యశో సాగర్ గురించి మాట్లాడుతూ ఆయన ఎంతో మంచివాడు ఏ ఒక్కరితో కూడా ఎలాంటి విభేదాలు లేకుండా అందరితో ఎంతో స్నేహభావంతో ఉండేవారు.

ఇలాంటి ఓ మంచి వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరం అంటూ ఆయన మరణం గురించి తెలియజేశారు.అయితే ఈయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని కేవలం కారు వేగంగా నడపడం వల్లే అదుపుతప్పి రోడ్డు ప్రమాదానికి గురయ్యారంటూ ఈ సందర్భంగా సాగర్ మరణం గురించి గుర్తుచేసుకొని సూర్య ఎమోషనల్ అయ్యారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు