6వ నెలలోనే పుట్టేసిన ముగ్గురు కవలలు, ఆరోగ్యంగా వున్నందున ఏకంగా గిన్నీస్ రికార్డ్!

వింటుంటే ఆశ్చర్యంగా వుంది కదూ.మీరు విన్నది నిజమే.

 Uk Sisters Set Guinness World Record For Most Premature Triplets To Survive Deta-TeluguStop.com

సాధారణంగా బిడ్డ పుట్టాలంటే అమ్మ కడుపులో తొమ్మిది నెలలు ఉండాల్సిందే.అది సృష్టి ధర్మం.

ఎన్నాళ్ళు అమ్మ గర్భంలో పెరిగితేనే పిల్లలు చక్కటి ఆరోగ్యంతో జన్మిస్తారు.అయితే కొన్ని కొన్నిసార్లు 7 నెలలకే ప్రసవం జరుగుతూ ఉంటుంది.

అలా పుట్టిన బిడ్డలు బాగానే ఉన్నప్పటికీ కాస్త అనారోగ్యంగా ఉండే అవకాశాలుంటాయని డాక్టర్లు చెబుతూ వుంటారు.అయితే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు కవలలు( Triplets ) అమ్మ కడుపులోంచి ఆరు నెలలు లోపే పుట్టేస్తే ఎలాగుంటుంది.

మిరాకిల్ కదా.ఇక్కడ కూడా అదే జరిగింది.పైగా వారు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా పుట్టి షాకిచ్చారు.

దాంతో వారు ఆరు నెలలు లోపే జన్మించిన శిశువులగా ఈ ముగ్గురు కవల పిల్లలు గిన్నీస్ వరల్డ్ రికార్డు( Guinness World Record ) సాధించేశారు.అవును, బ్రిటన్ కు ( Britain ) చెందిన ఈ ముగ్గురు పిల్లలు ప్రపంచంలోనే అతితక్కువ కాలం తల్లి గర్భంలో ఉన్న కవలలు(ట్రిప్లెట్స్‌)గా గిన్నిస్‌ రికార్డ్‌ సాచించారు.వీరి పేర్లు రూబీ రోజ్‌, పేటన్‌ జేన్‌, పోర్షా మే. వీరి పుట్టుకే ఓ ప్రపంచ రికార్డు అయింది ఇపుడు.ఇదే పెద్ద వింత అనుకుంటే వీళ్ల అమ్మకు ఆమె గర్భవతి అనే విషయం కూడా ఆమెకు తెలియదట! వీరు పుట్టటానికి కేవలం మూడు వారాల ముందు మాత్రమే తను గర్భవతి అనే విషయం తెలిసిందట!

అంతేకాకుండా వీరు 22 వారాల 5 రోజులకే పుట్టేసి తమ తల్లిదండ్రులకి షాక్ ఇచ్చారు.వీరు అతి తక్కువ బరువుతో ఫిబ్రవరి 14,2021న బ్రిస్టల్ లోని సౌత్ మీడ్ హాస్పిటల్ లో జన్మించినట్టు తెలుస్తోంది.కాగా వీరిని హాస్పిటల్ లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 216 రోజులు ఉంచారు.జన్మించిన సమయంలో వీరి ముగ్గురి బరువు కేవలం 1.28 కిలోలు మాత్రమే.దాదాపు నాలుగు నెలలు ముందుగా పుట్టిన ఈ చిన్నారులు సురక్షితంగా ఉండటానికి కొన్ని నెలల పాటు ఆసుపత్రిలోనే ఉంచాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube